కీర్తి సురేష్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.మలయాళం లో సూపర్ హిట్ అయినా ‘ప్రేమమ్’ సినిమాతో సిని ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది ఆ తరువాత అ..ఆ తో తెలుగు సినిమాలలోకి తెరంగ్రేటం చేసింది. తన మొదటి సినిమా తోనే సూపర్ హిట్ ను అందుకుంది. ఇక మహానటి సినిమాతో ఒక్క తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా తమిళం, హిందీలో బాషలలోనూ గుర్తింపు తెచ్చుకుంది. నేను శైలజ, నేను లోకల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది కీర్తి సురేష్.
అలనాటి నటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ‘మహానటి’తో జాతీయ స్థాయి ఉత్తమ నటి పురస్కారం అందుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోలా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది.ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ పారితోషికం వచ్చింది అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం నేచురల్ స్టార్ తో కలిసి నటించిన దసరా సినిమాకి కీర్తి సురేష్ మూడు కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా, సుధాకర్ చెరుకూరి శ్రీలక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవల దసరా సినిమా మోషన్ పోస్టర్ ను షేర్ చేశారు. ఇందులో నాని కఠినమైన లుక్ లో కనిపించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ విభాగాన్ని చేసుకుంటుండగా సత్యన్ సూర్యన్ isc సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…