ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప చిత్రంతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే కాస్త విరామం దొరకడంతో తన ఫ్యామిలీతో కలిసి ఇటీవలే మాల్దీవులలో ఎంజాయ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ హైదరాబాద్ రోడ్లపై ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాగే తన కూతురు అల్లు అర్హ, భార్య స్నేహ రెడ్డి ని తీసుకుని లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు.
అల్లుఅర్జున్ స్వయంగా కారు నడుపుతుండగా, అల్లు అర్హ మొబైల్స్ లో గేమ్ ఆడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని స్నేహ రెడ్డి చేసి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అఖిల్ లేటెస్ట్ మూవీ అయినా మోస్ట్ ఎలిజిబుల్ సినిమా లోని బుజ్జి గులాబి లాగా సాంగ్ వినిపిస్తోంది.ఈ వీడియో ని బట్టి చూస్తే అల్లు అర్జున్ వింటూ కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అల్లు అరవింద్, బన్నీ వాసు కలిసి నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా దీక్షకు నుంచి మంచి ఆదరణ పొందుతోంది. అల్లు అర్జున్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇందులో భాగంగానే ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది.
ఈ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో పాటుగా నటుడు ఫాహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ కి రష్మిక మందన నటిస్తోంది. ఈసినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో ఎక్కువగా అడవి నేపథ్యంలోనే జరుగుతోంది. ఇందులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ,భాషలలో ఈ సందర్భంగా డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…