Tag Archives: ys sharmila

Poonam Kaur: వైయస్ షర్మిలపై సెటైర్స్ వేసిన పూనమ్.. తన మౌనం ఆశ్చర్యంగా ఉందంటూ ట్వీట్!

Poonam Kaur: సినీ ఇండస్ట్రీలో సంచలన తారగా ఎంతో ఫేమస్ అయినటువంటి నటి పూనమ్ కౌర్ తరచు వివాదాస్పద పోస్టుల ద్వారా వార్తలలో నిలుస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో ఈమె రాజకీయాలను కూడా టచ్ చేస్తూ చేస్తున్నటువంటి పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా ట్వీట్లు చేసినటువంటి ఈమె వైయస్ జగన్మోహన్ పై ప్రశంసలు కురిపించారు.

ఇకపోతే తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ఈమె పొలిటికల్ లీడర్స్ ను ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెనాలికి చెందిన మహిళ గీతాంజలి ఇటీవల సోషల్ మీడియాలో టిడిపి జనసేన పార్టీ వాళ్లు చేసినటువంటి ట్రోల్స్ కు తీవ్రమైనటువంటి మనస్థాపానికి గురై ఈమె ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియా వేదికగా జనసేన టిడిపి కార్యకర్తలు చేసినటువంటి ట్రోల్స్ కారణంగా ఈమె మరణించారని తెలుస్తుంది. అయితే ఈమె మరణం పట్ల ఇప్పటికే ఎంతోమంది స్పందిస్తూ తనకు న్యాయం జరగాలి అంటూ పోస్టులు చేశారు. ఇక పూనమ్ కవర్ కూడా ఈమెకు న్యాయం జరగాలని నిందితులకు శిక్ష పడాలని కోరుకున్నారు.

గుణ పాఠం చెప్పాలి…
ఇక ఈ విషయం గురించి ఏపీ కాంగ్రెస్ పీసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల మౌనంగా ఉండడంతో పూనమ్ షర్మిలపై సెటైర్స్ వేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్త్రీ నాయకత్వానికి మొదటి ప్రధాన లక్షణం స్త్రీలు పిల్లల పట్ల ఎంతో కనికరంగా ఉండటం. ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేసిన గీతాంజలి ఘటన గురించి వైయస్ షర్మిల మౌనంగా ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ ఈమె పోస్ట్ చేశారు. తెనాలిలోని మహిళలు, బాలికలు బయటకు వచ్చి వారికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఈమె చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

Sharmila: కాంగ్రెస్ గూటికి చేరిన వైయస్ షర్మిల.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్ గాంధీ?

Sharmila: దివంగత రాజకీయ నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తెలంగాణలో వైయస్సార్టీపీ పార్టీ స్థాపించినటువంటి షర్మిల పెద్ద ఎత్తున తెలంగాణలో పాదయాత్ర చేస్తూ అధికార ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు. అయితే తీరా ఎన్నికల సమయంలో ఈమె మౌనం వహించడమే కాకుండా ఎన్నికల పోటీ నుంచి కూడా తప్పుకున్నారు.

ఇకపోతే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను అంటూ గత కొద్దిరోజుల క్రితం ఈమె వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక నిన్న సాయంత్రం తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించినటువంటి షర్మిల అటు నుంచి అటే ఢిల్లీకి వెళ్లారు అయితే నేడు ఉదయం 10:55 నిమిషాలకు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు.

ఈ క్రమంలోనే ఆమెకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వైఎస్ షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత వైఎస్ షర్మిల దంపతులు ఇద్దరు కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు అనంతరం ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడంతో తన తండ్రి గారు చాలా సంతోషపడతారని ఈమె వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది…

రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని వెల్లడించారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం తనకు ఏ పదవి అప్పగించిన శక్తివంచన లేకుండా పనిచేస్తానని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ.. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన పార్టీ కాంగ్రెస్ అని షర్మిల అన్నారు. ఇలా ఈమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చెప్పడంతో కొందరు వైయస్సార్ అభిమానులు ఈమె వ్యవహరి శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

YS Sharmila: వైయస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డిని చూశారా… అచ్చం అలాగే ఉందంటూ కామెంట్స్?

YS Sharmila: వైయస్సార్ టిపి అధ్యక్షరాలు షర్మిల క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలను చర్చిలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తన భర్త అనిల్ కుమార్ తో పాటు తన కుమారుడు రాజారెడ్డి కూతురు అంజలి రెడ్డితో కలిసి షర్మిల క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం వీరి క్రిస్మస్ వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షర్మిల సమక్షంలో కేక్ కట్ చేసి ఈ వేడుకలను జరుపుకున్నారు. అయితే ఈ ఫోటోలలో షర్మిల కుమార్తె అంజలి రెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అంజలి రెడ్డి అత్యంత తల్లి పోలికలతోనే ఉంది అంటూ పలువురు ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

ఇక షర్మిల పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి అనే విషయానికి వస్తే షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవల విదేశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.రాజారెడ్డి అప్లయిడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు, కూతురు అంజిలి రెడ్డి బీబీఏ ఫైనాన్స్ డిగ్రీ చదివారు. ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన రాజారెడ్డి, అంజిలి రెడ్డి.. తమ తల్లిదండ్రులతో కలిసి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు.

ప్రేమ వివాహం చేసుకోబోతున్న రాజారెడ్డి…

ఇకపోతే రాజారెడ్డి గురించి కథ కొద్ది కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయితో ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకరించారంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఆ అమ్మాయి ఇటీవల షర్మిల ఇంటికి రాగా వైఎస్ విజయమ్మ ఆ అమ్మాయికి చీరసారే పెట్టిన సంగతి తెలిసింది. దీంతో త్వరలోనే ఈయన ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Surekha Vani: దండం పెడతా తక్కువ మాట్లాడంటూ వైయస్ షర్మిలపై ట్రోల్స్ చేసిన సురేఖ వాణి!

Surekha Vani: సురేఖ వాణి పరిచయం అవసరం లేని పేరు ఎన్నో తెలుగు సినిమాల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి ప్రస్తుతం సినిమాలను తగ్గించి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా తన కుమార్తె సుప్రీతతో కలిసి ఈమె సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా లేదు.

సోషల్ మీడియా వేదికగా ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక సురేఖ వాణి పాతికేళ్ల అమ్మాయిగా పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ పొట్టి దుస్తుల ధరిస్తూ అభిమానులను భారీగా సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో సురేఖ వాణి ఎక్కువగా వైఎస్ షర్మిలను ఇమిటేట్ చేస్తూ రీల్స్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా ఉంటున్నారు.అయితే మీడియా సమావేశాలలో భాగంగా ఈమె మాట్లాడే కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పాదయాత్ర అంటే పాదాలపై చేసే యాత్ర అని స్టూడెంట్ అని ఎందుకు అంటున్నారు అంటే వారు యువత కాబట్టి అంటూ పలు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు అయితే తాజాగా సురేఖ వాణి వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను ఇమిటేట్ చేస్తూ రీల్ చేశారు.

Surekha Vani: నాకు టిపికల్ యాంగ్జైటీ వస్తోంది


స్టూడెంట్ ని స్టూడెంట్ అని ఎందుకు అంటున్నారు అంటే వారు యువత కాబట్టి అనే డైలాగును ఇమిటేట్ చేస్తూ అందులో డీసెట్ టిల్లు డైలాగ్ ను సెటైరికల్ గా పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో నీకు దండం పెడతా.. నువ్వు ఎంత తక్కువ పాజిబుల్ అయితే అంత తక్కువ మాట్లాడు రాధిక.. నాకు టిపికల్ యాంగ్జైటీ వస్తోంది అని డైలాగ్స్ పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

YS Sharmila: కొడుకు ఫోటోలను షేర్ చేసిన వైఎస్ షర్మిల… కటౌట్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్న నేటిజన్స్!

YS Sharmila: వైయస్ షర్మిల పరిచయం అవసరం లేని పేరు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా సుపరిచితమైనటువంటి ఈమె ప్రస్తుతం తెలంగాణలో పార్టీ స్థాపించి తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఇలా తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు.

ఇక షర్మిల భర్త అనిల్ పాస్టర్ గా ప్రవచనాలు చెబుతూ నిత్యం టీవీలలో సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇలా షర్మిల అనిల్ ఇద్దరిని మనం తరచూ చూస్తూ ఉన్నప్పటికీ వీరి పిల్లలు ఎలా ఉన్నారనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అయితే సెలబ్రిటీల పిల్లలను చూడాలని అభిమానులు ఎలా అయితే ఆశపడతారో రాజకీయ నాయకుల పిల్లలను చూడాలని కూడా అంతే ఆత్రుత పడుతుంటారు.

ఇక వైయస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ప్రస్తుతం విదేశాలలో చదువుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలలో స్థిరపడినటువంటి రాజారెడ్డి తాజాగా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.ఈ క్రమంలోనే వైయస్ షర్మిల తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

YS Sharmila: హీరోకి ఏమాత్రం తీసిపోని రాజారెడ్డి….

ఈ క్రమంలోనే వైయస్ రాజారెడ్డి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదేంటి షర్మిల కొడుకు ఇలా ఉన్నాడు. హీరో కటౌట్ కి ఏమాత్రం తీసిపోడు… రాజారెడ్డి కటౌట్ అదిరిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే రాజారెడ్డి ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది అభిమానులు రాజారెడ్డి చదువులు పూర్తి చేసుకున్న తర్వాత తన తాతయ్య మామయ్యలా రాజకీయాలలోకి వెళ్తారా లేక సినిమాలలోకి వస్తారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

YS Sharmila: మా నాన్నను కుట్ర చేసి చంపారు.. వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్!

YS Sharmila: వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎంత చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీ స్థాపించిన ఆమె వచ్చే ఎన్నికలలో పెద్ద ఎత్తున పోటీకి దిగుతున్నారు.ఈ క్రమంలోనే కెసిఆర్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఆమె పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్తున్నారు.

ఈ విధంగా తన పార్టీని ప్రజలలోకి తీసుకెళ్తూ ఈమె ప్రచారం నిర్వహిస్తుండగా తన ప్రచారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడుతుందని ఈమె ఆరోపించారు. ఇకపోతే తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి ఈమె కొందరు తనని హత్య చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

YS Sharmila: తనని చంపడానికి కుట్ర చేస్తున్నారు…

తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కుట్ర చేసే చంపారని అలాగే తనని కూడా చంపడానికి ప్లాన్ చేస్తున్నారంటూ ఈమె చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాపై ఎన్ని కుట్రలు చేసినా తను భయపడనని తను పులిబిడ్డను, తనకు భయం లేదు ఈ సంకెళ్లు నన్ను ఆపలేవు అంటూ ఈమె సంకెళ్లు చూపిస్తూ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడితే టిఆర్ఎస్ నేతలకు వణుకు ఎందుకు అని ఈమె ప్రశ్నించారు. షర్మిల తన తండ్రి మరణం గురించి తనని కుట్ర చేసే హత్య చేశారంటూ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భారత్ బంద్ కు మద్దతు తెలిపిన వైఎస్ షర్మిల.. ఆర్టీసీ కార్మిక జేఏసీ కూడా..

రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రపతి అవి ఆమోదించి సెప్టెంబర్ 27 నాటికి సంవత్సరం అయింది. దీంతో దానికి నిరసనగా సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు ఇవాళ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి.

ఈ సందర్భంగా 40 రైతు సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ దేశవ్యాప్త నిరసన చేపట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా సన్నాహాలు చేసినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. ఈ బంద్‌కు దేశంలోని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది.

అయితే ఈ బంద్ కు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి షర్మిల ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రతీ ఒక్కరు మద్దతు తెలిపి ఈ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నించాలన్నారు. ప్రభుత్వ విధానాలకు ఎండగట్టేందుకు త్వరలోనే పాతయాత్రను చేపట్టబోతున్నట్లు షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మిక జేఏసీ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించగా.. యాజమాన్యం మాత్రం బస్సు సర్వీసులు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు దీక్ష చేస్తా.. వైఎస్ షర్మిల

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఆరేళ్ల చిన్నారి చైత్రను రాజు అనే దుండగుడు ఎత్తుకెళ్లి.. అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన హైదరాబాద్ లోని సైదాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రతీ ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇటు సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ ఘటనను ఖండిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రతీ ఒక్కరు గాలిస్తున్నారు.

ఆచూకీ తెలిపిన వారికి తెలంగాణ పోలీసులు రూ.10 లక్షలు రివార్డు కూడా ఇస్తానని ప్రకటించారు. దానికి సంబంధించి నిందితుడి ఫొటో, ఆనవాళ్లను కూడా షేర్ చేశారు. ఇప్పటికే అతడి ఫొటో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా, మీడియాల ద్వారా ప్రజల్లోకి వెళ్లిపోయింది. కానీ అతడి ఆచూకీ మాత్రం ఇంత వరకు తెలియరాలేదు. అయితే దీనిపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు.

వాళ్ల కుటుంబసభ్యులను ఆమె కలిసి ఓదార్చారు. ఆ చిన్నారి ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సంఘటనపై స్పందించే వరకు అక్కడే దీక్ష చేపడతనాని హెచ్చరిస్తూ దీక్ష చేపట్టారు. మరోవైపు బాధిత కుటుంబానికి పది కోట్ల రూపాయల పరిహారాన్ని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారంలోకి వెచ్చిన తర్వాత హత్యలు, అత్యాచారాలు రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు..

ఇంత పెద్ద ఘటన జరిగినా వాళ్ల కుటుంబసభ్యులను పరామర్శించడానికి ఈ ప్రాంతమంతా దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ రాకపోవడం దురదృష్టకరం అని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణం. చిన్నారి చైత్ర కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. కేసీఆర్ నోరు విప్పి, బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష చేస్తా’ అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం పై షర్మిల ఫైర్!

టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు వైఎస్సార్టిపీ అధ్యక్షురాలు షర్మిల. ప్రభుత్వం కొత్తగా రేషనలైజేషన్ ప్రక్రియకు తెరతీసిందని ఆరోపించారు. దీని కారణంగా వేల మంది టీచర్లు రోడ్డున పడే అవకాశం ఉన్నట్లు షర్మిల పేర్కొన్నారు.

కాగా రేషనలైజేషన్ విధానంపై ట్వీట్ చేస్తూ..‘టీచర్ ఉద్యోగాల కోతతో ఉరితాడు పేనుతున్నవ్. మీ 7 ఏండ్ల పాలనలో..  సర్కార్ విద్యను మరియు సర్కార్ వైద్యాన్ని భ్రష్టు పట్టించినవ్. సర్కార్ బడులను సక్కగా చేసుడు చేతకానప్పడు..  ఉద్యోగాలు కల్పించడం చేతకానప్పుడు..  పరిపాలన చేయడం చేతకానప్పుడు..  మీకు ముఖ్యమంత్రి పదవి కూడా దండుగ కేసీఆర్’ అని షర్మిల ట్వీట్ చేశారు.

ముందు విడాకులు..తర్వాత ప్రేమించుకోవడాలు అంటూ వైయస్ షర్మిల పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్వేత!

వైయస్సార్ తనయ వైఎస్ షర్మిల తాజాగా తెలంగాణలో కొత్త పార్టీని ఆవిష్కరించిన సంగతి మనకు తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో తిరిగి వైయస్ రాజశేఖర్రెడ్డి పాలనను తిరిగి తీసుకురావడం కోసమే తాను పార్టీని ఆవిష్కరించాలని ఇదివరకే తెలియజేశారు. ఈ క్రమంలోనే”వైయస్సార్ తెలంగాణ పార్టీ”ని ఏర్పాటు చేస్తున్నట్లు, షర్మిల వెల్లడిస్తూ జెండాను ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్ మాట మాట్లాడితే కెసిఆర్ అవినీతికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని మాట్లాడుతారు. అయితే ఆ ఆధారాలను బయటపెట్టి కెసిఆర్ గారి పై చర్యలు తీసుకోవచ్చు కదా.కేంద్రంలో ఉన్నది బిజెపి ప్రభుత్వమే అయినప్పటికీ కేసీఆర్ అవినీతిని ఎందుకు బయటపెట్టడం లేదు అంటూ ఆమె బండి సంజయ్ అని ప్రశ్నించారు.

కెసిఆర్ చేస్తున్నటువంటి అవినీతికి సంబంధించిన ఆధారాలు బండి సంజయ్ దగ్గర ఉన్నప్పటికీ అవి బయట పెట్టకపోవడానికి గల కారణం వీరిద్దరి మధ్య ఒప్పందం ఉందని షర్మిల ఆరోపించారు.ఈ క్రమంలోనే వైయస్సార్ గురించి ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే కోట్ల మంది ఆయన అభిమానులు అసలు సహించరని వారిని పరిగెత్తించి కొడతారంటూ షర్మిల వార్నింగ్ ఇచ్చారు.

బిజెపి నాయకుడు బండి సంజయ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన షర్మిలపై బిజెపి శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ ..బిజెపి మహిళా నాయకురాలు శ్వేతారెడ్డి షర్మిలకు భారీ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే షర్మిల వ్యక్తిగత విషయాలను తెరపైకి తీసుకువస్తూ ఆమెపై పలు ఆరోపణలు చేశారు. తెలంగాణలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశ్నించడానికి మీరు ఎక్కడికి వెళ్లారు…? పార్టీ పెట్టగానే తెలంగాణలో సమస్యలు గుర్తుకు వచ్చాయా? అంటూ షర్మిలను ప్రశ్నించారు.

అసలు కెసిఆర్ గారు, బండి సంజయ్ గారికి మధ్య ఎలాంటి డీల్స్ లేవు ఉన్నది మీకు కేసీఆర్ కంటూ ఆమె ఆరోపించారు.మీ మధ్య ఉన్న ఒప్పందం ఎక్కడ బయటపడుతుందో అన్న ఉద్దేశంతోనే ముందుగానే మా నాయకుడిపై ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అలాంటి అవసరం మా నాయకుడికి లేదు ఆయనకు ముందుగా విడాకులు తీసుకొని లోలోపలే ప్రేమించుకోవడం …కాపురాలు చేయడం తెలియని కెసిఆర్ మెడలు వంచడానికి బండి సంజయ్ అసలు సిసలైన వ్యక్తి అంటూ ఇంకోసారి మా నాయకుడు గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి అంటూ యాంకర్ శ్వేతారెడ్డి షర్మిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.