Surekha Vani: సురేఖ వాణి పరిచయం అవసరం లేని పేరు ఎన్నో తెలుగు సినిమాల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి ప్రస్తుతం సినిమాలను తగ్గించి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా తన కుమార్తె సుప్రీతతో కలిసి ఈమె సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా లేదు.
సోషల్ మీడియా వేదికగా ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక సురేఖ వాణి పాతికేళ్ల అమ్మాయిగా పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ పొట్టి దుస్తుల ధరిస్తూ అభిమానులను భారీగా సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో సురేఖ వాణి ఎక్కువగా వైఎస్ షర్మిలను ఇమిటేట్ చేస్తూ రీల్స్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా ఉంటున్నారు.అయితే మీడియా సమావేశాలలో భాగంగా ఈమె మాట్లాడే కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పాదయాత్ర అంటే పాదాలపై చేసే యాత్ర అని స్టూడెంట్ అని ఎందుకు అంటున్నారు అంటే వారు యువత కాబట్టి అంటూ పలు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు అయితే తాజాగా సురేఖ వాణి వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను ఇమిటేట్ చేస్తూ రీల్ చేశారు.
స్టూడెంట్ ని స్టూడెంట్ అని ఎందుకు అంటున్నారు అంటే వారు యువత కాబట్టి అనే డైలాగును ఇమిటేట్ చేస్తూ అందులో డీసెట్ టిల్లు డైలాగ్ ను సెటైరికల్ గా పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో నీకు దండం పెడతా.. నువ్వు ఎంత తక్కువ పాజిబుల్ అయితే అంత తక్కువ మాట్లాడు రాధిక.. నాకు టిపికల్ యాంగ్జైటీ వస్తోంది అని డైలాగ్స్ పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…