Analyst Damu Balaji : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసినా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణ సిబిఐ కి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. సునీత రెడ్డి ఈ కేసు విషయంలో చాలా పట్టుదలగా ఉండగా సిబిఐ అవినాష్ వెనుకే పడింది అంటూ అనలిస్ట్ దాము బాలాజీ అంటున్నారు.
సిబిఐ చేతిలో కాల్ డేటా…
మొదటి నుండి వివేకానంద హత్య కేసులో సిబిఐ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి మీదనే ఫోకస్ చేసారంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. గూగుల్ టేక్ అవుట్ ద్వారా హత్య నిందితులుగా భావిస్తున్న షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ల ఫోన్లు అవినాష్ రెడ్డి ఇంటి వద్దనే కనిపిస్తుండటం వల్ల అలాగే హత్య జరిగాక ఉదయాన్నే అక్కడికి వెళ్లిన అవినాష్ రెడ్డి రక్తపు మారకలను శుభ్రం చేయించారనే అనుమానంతో సిబిఐ ఆయన్ను విచారిస్తోంది. అయితే తాజాగా సిబిఐ అవినాష్ రెడ్డి కాల్ డేటా ను కోర్ట్ కి సమర్పించింది. అవినాష్ రెడ్డి హత్య ముందు రోజు సాయంత్రం తండ్రి భాస్కర్ రెడ్డి తో మాట్లాడినట్లు అలాగే ఆ తరువాత ఉమా శంకర్ రెడ్డి తదితరులతో మాట్లాడినట్లు సిబిఐ పేర్కొన్ది.
ఇక మొదటి నేరస్థుడైన షేక్ దస్తగిరి ఫోన్ నుండి చాలా మెసేజ్లు ఎర్ర గంగిరెడ్డి కి అలాగే సునీల్ యాదవ్ కి ఇలా ఆ గ్రూప్ లో ఉన్న అందరూ కాల్స్ చేసుకున్నట్లు సిబిఐ గుర్తించింది. అయితే హత్యకు సంబంధిచిన ఎటువంటి మాటలు మాట్లాడకపోయినా వాళ్ళందరూ పదే పదే కాల్స్ చేసుకోవడం గురించి సిబిఐ అనుమానిస్తుంది. ఇక దీని గురించి బాలాజీ మాట్లాడుతూ ఫోన్ కాల్స్ మాత్రమే ఆధారంగా విచారణ చేయాలని సిబిఐ చూస్తోంది అలాగే ఆవినాష్ రెడ్డిని కస్టడీకి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. అవినాష్ చేయించాడు అనడానికి ఒక్క ప్రూఫ్ లేకపోయినా అరెస్టు చేయాలని భావిస్తోంది. సిబిఐ ఏకపక్షంగా విచారణ చేస్తోందంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…