Featured

Analyst Damu Balaji : శ్వేత ఆత్మహత్య కి సవతి వేధింపులే కారణం…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వైజాగ్ లో మరణించిన వివహిత శ్వేత ఆత్మహత్య వెనుక ఒక్కో చిక్కుముడి వీడుతున్నాయి. అయితే ఆమె మానసికంగా ఎంతో బాధపడటం వల్లే ఆత్మహత్య చేసుకుందనే విషయం స్పష్టం అవుతోంది. ఇప్పటివరకూ అత్తింటి వారి వేధింపులే కారణం అనుకుంటుండగా ఇప్పుడు భర్త మణికంఠ కి ఉన్న అఫైర్ కూడా కారణం అని తెలుస్తోంది. హైదరాబాద్ లో వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్న మణికంఠ పెళ్లి చేసుకున్న భార్య శ్వేతను నిర్లక్ష్యం చేసాడు. పెళ్ళైనా నాకేమి అభ్యంతరం లేదని ప్రియురాలు భరోసా ఇవ్వడంతో ఇక్కడ భార్యను తల్లిదండ్రుల వద్ద పెట్టి అక్కడ ప్రేయసితో హైదరాబాద్ లో ఉంటున్నాడు మణికంఠ అంటూ అనాలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

శ్వేత మరణానికి మణికంఠ ఎఫైర్ కారణం…

శ్వేత అత్తింట్లో వేధింపుల గురించి తన భర్తతో చెప్పుకుంది. అయితే భర్త నుండి సరైన స్పందన లేకపోవడం, హైదరాబాద్ కి తీసుకెళ్లమని అడిగినా మణికంఠ తీసుకుని పోకుండా వైజాగ్ లో తల్లిదండ్రుల వద్ద ఉంచడం, గర్భిణీగా ఉన్న శ్వేతకు మరింత బాధ కలిగించింది అంటూ తెలిపారు బాలాజీ. గర్భిణీగా ఉన్న ఏ స్త్రీ అయినా భర్తతో ఉండాలని కోరుకుంటుంది. అలానే శ్వేత కూడా భావించినా మణికంఠ పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

అదీ కాక హైదరాబాద్ లో ఉన్న మణికంఠ ప్రేయసి కూడా శ్వేతకు ఫోన్ చేసి తిట్టడం వంటివి చేసిందని వార్తలు బయటికి వస్తున్నాయని తెలిపారు బాలాజీ. ఇవన్నీ శ్వేత మనసుని మరింత గాయపరిచి ఆత్మహత్య కు ప్రేరేపించి ఉండవచ్చని తెలిపారు. ఇక శ్వేత ఫోన్ డేటా ను ఫారెన్సిక్ వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఆ రిపోర్ట్స్ బయటికి వస్తే మరింత సమాచారం తెలుస్తుంది అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago