Anchor Varshini: బుల్లితెర మీద సందడి చేస్తున్న యంకర్లలో వర్షిణి కూడా ఒకరు. బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవి షోలలో యాంకర్ గా సందడి చేస్తూ తన అందాలతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే అడపా దడపా సినిమాలలో నటిస్తూ నటిగా కూడా గుర్తింపు పొందింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన గ్లామర్ తో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.
తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూసిన నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌కు వర్షిణీ హాజరైంది.ట్రెండీ దుస్తుల్లో ఎంతో స్టైలిష్‌గా ముస్తాబై వచ్చిన వర్షిణీ గ్యాలరీలో నిలబడి సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ను ఎంకరేజ్ చేసింది.
దురదృష్టవశాత్తూ కేకేఆర్ చేతిలో 5 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయం పాలైంది . దీంతో సన్ రైజర్స్ అభిమానులు వర్షిణిని ట్రోల్ చేస్తున్నారు.
ఎందుకంటే గతంలోనూ ఉప్పల్ వేదికగా జరిగిన హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్‌కు వర్షిణి హాజరైంది. ఆ మ్యాచ్‌లో కూడా హైదరాబాద్ ఓటమి పాలైంది.
అంతే కాకుండా ఆ మ్యాచ్‌లో ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్‌తో కలిసి ఫొటోలు కూడా దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే వర్షిణి అటెండ్ అయిన మ్యాచ్ లలో హైదరాబాద్ మ్యాచులు ఓడిపోవడంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. నవ్వు ఇంకోసారి స్టేడియానికి రావొద్దు అంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…