Nagachaitanya: గీతా గోవిందం సినిమా ద్వారా దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ పరుశురామ్ గత ఏడాది మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో అనంతరం పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య సినిమా చేయబోతున్నారనీ వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు.
ఇకపోతే గతంలో ఓసారి నాగచైతన్యని కలిసిన పరుశురామ్ స్టోరీ వినిపించారని అయితే ఆ స్టోరీ నాగచైతన్యకు నచ్చకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాకు నాగేశ్వరరావు అనే టైటిల్ కూడా పెట్టారని ఫిక్స్ అయ్యారట. సర్కారు వారి పాట సినిమా తర్వాత ఈ సినిమా చేయాలని నాగచైతన్యను పరుశురామ్ వెయిట్ చేయించారని తెలుస్తోంది.
ఇక కథ మొత్తం విన్నటువంటి నాగచైతన్య స్క్రిప్ట్ విషయంలో ఏ మాత్రం సంతృప్తి పొందకపోవడంతో తాను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారట.అయితే తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి నాగచైతన్య ఈ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు. ఇక డైరెక్టర్ పరుశురామ్ గురించి కూడా మాట్లాడారు.
ఇలా ఈ టాపిక్ రావడంతో నాగచైతన్య మాట్లాడుతూ
పరుశురామ్ గురించి మాట్లాడటం వేస్ట్ ఆయన తన సమయాన్ని చాలా వేస్ట్ చేశారని చెప్పారు. ఇప్పుడు కూడా తన టాపిక్ మాట్లాడటం నాకు ఏమాత్రం ఇష్టం లేదని కామెంట్ చేయడంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నాగచైతన్య ఈ సినిమా స్టోరీ రిజెక్ట్ చేసిన తర్వాత ఇదే కథతో పరుశురామ్ విజయ్ దేవరకొండ ను కలిసి కథ వినిపించారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…