YS Sharmila: వైయస్సార్ టిపి అధ్యక్షరాలు షర్మిల క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలను చర్చిలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తన భర్త అనిల్ కుమార్ తో పాటు తన కుమారుడు రాజారెడ్డి కూతురు అంజలి రెడ్డితో కలిసి షర్మిల క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారని తెలుస్తుంది.
ప్రస్తుతం వీరి క్రిస్మస్ వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షర్మిల సమక్షంలో కేక్ కట్ చేసి ఈ వేడుకలను జరుపుకున్నారు. అయితే ఈ ఫోటోలలో షర్మిల కుమార్తె అంజలి రెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అంజలి రెడ్డి అత్యంత తల్లి పోలికలతోనే ఉంది అంటూ పలువురు ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.
ఇక షర్మిల పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి అనే విషయానికి వస్తే షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవల విదేశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.రాజారెడ్డి అప్లయిడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు, కూతురు అంజిలి రెడ్డి బీబీఏ ఫైనాన్స్ డిగ్రీ చదివారు. ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన రాజారెడ్డి, అంజిలి రెడ్డి.. తమ తల్లిదండ్రులతో కలిసి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు.
ప్రేమ వివాహం చేసుకోబోతున్న రాజారెడ్డి…
ఇకపోతే రాజారెడ్డి గురించి కథ కొద్ది కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయితో ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకరించారంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఆ అమ్మాయి ఇటీవల షర్మిల ఇంటికి రాగా వైఎస్ విజయమ్మ ఆ అమ్మాయికి చీరసారే పెట్టిన సంగతి తెలిసింది. దీంతో త్వరలోనే ఈయన ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…