Sharmila: దివంగత రాజకీయ నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తెలంగాణలో వైయస్సార్టీపీ పార్టీ స్థాపించినటువంటి షర్మిల పెద్ద ఎత్తున తెలంగాణలో పాదయాత్ర చేస్తూ అధికార ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు. అయితే తీరా ఎన్నికల సమయంలో ఈమె మౌనం వహించడమే కాకుండా ఎన్నికల పోటీ నుంచి కూడా తప్పుకున్నారు.
ఇకపోతే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను అంటూ గత కొద్దిరోజుల క్రితం ఈమె వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక నిన్న సాయంత్రం తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించినటువంటి షర్మిల అటు నుంచి అటే ఢిల్లీకి వెళ్లారు అయితే నేడు ఉదయం 10:55 నిమిషాలకు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు.
ఈ క్రమంలోనే ఆమెకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వైఎస్ షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత వైఎస్ షర్మిల దంపతులు ఇద్దరు కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు అనంతరం ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడంతో తన తండ్రి గారు చాలా సంతోషపడతారని ఈమె వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది…
రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని వెల్లడించారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం తనకు ఏ పదవి అప్పగించిన శక్తివంచన లేకుండా పనిచేస్తానని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ.. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన పార్టీ కాంగ్రెస్ అని షర్మిల అన్నారు. ఇలా ఈమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చెప్పడంతో కొందరు వైయస్సార్ అభిమానులు ఈమె వ్యవహరి శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…