దూర ప్రాంతాలకు వెల్లే ప్రయాణికులకు.. బడ్జెట్ ధరలో ప్రయాణ సౌక్యాన్ని కల్పించే శాఖ రైల్వే. రైల్వే ప్రయాణం అంటే ఎంతో మంది ఇష్టపడతారు. దీని ద్వారా ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు అనే భావన కూడా ఉంటుంది. 99 శాతం ప్రమాదాలు అనేవి రైల్వే ప్రయాణంలో చోటు చేసుకోవు.. కానీ కొన్నిసందర్బాల్లో అనుకోని ఘటనల వల్ల ప్రమాదలు సంభవిస్తాయి.
తాజాగా జరిగిన ఘటనలో ఓ రైలులో అగ్ని ప్రమాదం సంభంవించింది. రైలులోని ఏసీ బోగీలో ఈ మంటలు వ్యాపించాయి. ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాజ్ ఎక్స్‌ప్రెస్ అనే రైలు న్యూఢిల్లీ నుంచి ఝాన్సీ వరకు వెళ్తుంది. డిల్లీ నుంచి యూపీలోని ఝాన్సీ వెళుతున్నఈ రైలు లో శనివారం ఉదయం ఏసీ బోగీ నుంచి పొగ వస్తున్నట్లు గుర్తించారు.
దీంతో ప్రయాణికులు హడలిపోయారు. భయాందోళనలకు గురయ్యారు. ఏసీ బోగీలో స్వల్పంగా మంటలు వ్యాపించటంతో రైలును హర్యానాలోని అసోతి స్టేషన్ వద్ద నిలిపివేశారు. బ్రేక్ జామ్ కావడం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లు ఓ రైల్వే అధికారి చెప్పారు. వెంటనే స్పందించి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.
ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదంటూ చెప్పారు. స్వల్ప స్థాయిలోనే మంటలు వచ్చాయని.. మంటల కంటే ఎక్కువగా పొగ కమ్ముకుందని సీపీఆర్వో దీపక్ కుమార్ తెలిపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రతీ ఒక్కరూ ఉలిక్కిపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చనేది అనుమానిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…