బాల నటుడిగా వెండితెరకు పరిచయమై ప్రస్తుతం కథానాయకుడిగా వరుస చిత్రాలు చేస్తున్నారు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ. అయితే తనకు ప్రముఖ అగ్ర హీరోలతో ఉన్న మెమోరెబుల్ మూమెంట్స్ గురించి ఆకాశ్ ఇలా చెప్పారు.ఇక వివరాల్లోకి వెళితే జూనియర్ ఎన్టీఆర్ తనను ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటారని ఆకాశ్ తెలిపారు. ఇకపోతే ఈ మధ్యే విడుదలైన రొమాంటిక్ సినిమా ట్రైలర్ లాంచ్ సమయంలో ప్రభాస్ తనను మెచ్చుకున్నారని ఆయన అన్నారు.
అంతే కాకుండా అంత పెద్ద స్టార్‌తో కలిసి రీల్స్ చేయడం అనేది అల్టీమెట్ అని ఆకాశ్ చెప్పుకొచ్చారు. ఎవరికీ దక్కని ఆ అద్భుత అవకాశం తనకు దక్కిందన్న ఆయన, చాలా థ్యాంక్స్ అని ఆకాశ్ అన్నారు. ఇదిలా ఉండగా తాను స్విట్జర్‌ల్యాండ్‌లో హాలిడేస్‌లో ఉన్నపుడు రవితేజ గారు అపుడు ఏదో షూటింగ్ చేస్తున్నారని ఆకాశ్ చెప్పుకొచ్చారు. అది అనుకోకుండా అపుడు అలా ఆయన్ను కలిశానని ఆయన చెప్పారు.
ఆ షూటింగ్ అయిపోయాక ఆయన షాపింగ్ చేస్తున్నపుడు తాను కూడా వెంట వెళ్లానని ఆకాశ్ చెప్పారు. అది తనకు చాలా బ్యూటీపుల్‌గా అనిపించిందని ఆయన అన్నారు. అదే విధంగా తారక్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ మామూలోడు కాదు ఆయన అందరినీ ఎంతో సరదాగా టీజ్ చేస్తుంటారని ఆకాష్ తెలిపారు.
ఇకపోతే ఆకాష్ పూరీ హీరోగా, కొత్త హీరోయిన్ కేతిక శర్మ హీరోయిన్‌గా వచ్చిన లేటెస్ట్ లవ్ డ్రామా ‘రొమాంటిక్’. సరికొత్త కాన్సెప్ట్‌తో లవ్ స్టోరీ నేపథ్యంలో ‘రొమాంటిక్’ సినిమాను తెరకెక్కించారు. మధ్యలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అటువంటిది ఏమి లేదంటూ క్లారిటీ ఇవ్వడమే కాదు అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఆకాశ్ పూరి. అయితే ఇప్పటికే పలు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినా అంతగా ఆకట్టుకోలేకపోవడం తెలిసిందే .
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…