Tamanna in cash programme : మిల్కీ బ్యూటీగా తెలుగు తెరకు బాగా తెలిసిన ముద్దుగుమ్మ తమన్నా భాటియ. తన అందం డాన్సులు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో టాప్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తక్కువ సినిమాల్లో నటిస్తోంది. శ్రీ సినిమాలో మనోజ్ సరసన నటించి సినిమాల్లో తన ప్రస్థానం మొదలుపెట్టిన తమన్నా ఆ తరువాత టాప్ హీరోస్ తో మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. తెలుగే కాకుండా పలు భాషల్లో నటించి మెప్పించిన తమన్నా మాస్ట్రో సినిమాతో ఆ మధ్య కనిపించింది. ఇక ఇపుడు f2 సినిమా కొనసాగింపుగా వస్తోన్న f3 సినిమాతో రాబోతోంది.
క్యాష్ లో సందడి చేసిన తమన్నా….
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న f3 మే 27 నా విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా ప్రచారాల్లో భాగంగా ఈటీవీలో సుమ యాంకర్ గా వస్తోన్న క్యాష్ ప్రోగ్రాంలో సందడి చేసింది f3 టీం. దర్శకుడు అనిల్ రావిపూడి, సునీల్ ఇక హీరోయిన్లు తమన్నా, సోనాలి చౌహన్ లు ప్రోగ్రామ్ లో సందడి చేసారు. క్యాష్ 200రోజుల ఎపిసోడ్ లో భాగంగా ఈ ఎపిసోడ్ రానుంది ఇక సుమ పంచులకు తమన్నా, సోనాలి చౌహన్ లా గ్లామర్ తోడై ప్రోమో ఆకట్టుకుంది. ఇక సుమ తో సునీల్ ఆడుకున్న విధానం నవ్వులు తెప్పించింది.
ఇక ఈ షోలో తమన్నాకు చాలా మంది అబ్బాయిలు గులాబీలు ఇచ్చి ప్రపోజ్ చేయడం ప్రోమోలో చూపించారు. తమన్నా వస్తువులను వేలం వేయడం వంటి కాన్సెప్ట్ తో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇక అనిల్, సునీల్ టైమింగ్ పంచులతో ఆకట్టుకున్నారు. ఇక చివర్లో మాత్రం తమన్నా కళ్ళలో నీళ్లు వచ్చి ఎమోషనల్ గా ప్రోమో ను ఎండ్ చేసారు. మరియు తమన్నా ఎందుకు ఏడ్చారో తెలియాలంటే మాత్రం క్యాష్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చూడాల్సిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…