Tamannah: సినిమా ఇండస్ట్రీలో నటి తమన్నకు ఎంతో ప్రత్యేకమైన క్రేజ్ ఉందని చెప్పాలి. నటిగా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి తమన్న ఒకప్పుడు కేవలం సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై సౌత్ సినిమాలలో నటించేవారు కానీ ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈమె సినిమాల పరంగా కాకుండా గత కొద్ది రోజులుగా వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.
తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా విజయవర్మతో కలిసి పలుమార్లు ఈమె బయట కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు ఇలా వీరిద్దరి రిలేషన్ గురించి పలుమార్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన లవ్ స్టోరీ 2 ప్రమోషన్లలో భాగంగా తమన్న తమ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ అవును తాను విజయవర్మతో ప్రేమలో ఉన్నానని మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ నిజమేనంటూ క్లారిటీ ఇచ్చారు. లవ్ స్టోరీ 2సినిమా సమయంలోనే తనతో ప్రేమలో పడ్డానని తెలిపారు. అయితే కేవలం తన సహనటుడు అని మాత్రమే తాను ప్రేమించలేదని, విజయ్ నాకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి నాకు రక్షణగా తను నిలబడతారని నమ్మకం నాకు కలిగిందని తమన్నా తెలిపారు.
మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్ బంధం ఉంది ఎవరైతే నన్ను కిందికి లాగాలని ప్రయత్నిస్తారో వారి నుంచి విజయ్ నన్ను రక్షిస్తాడు అన్న నమ్మకం నాలో ఉంది. నాకోసం నేను ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. ఈ అందమైన ప్రపంచంలోకి విజయ్ ఎంట్రీ ఇచ్చారు.తను నాపట్ల చాలా శ్రద్ధ తీసుకోవడమే కాకుండా తన ఉన్న ప్రదేశం నాకు ఎంతో సంతోషకరమైన ప్రదేశంగా మార్చాడు అంటూ ఈ సందర్భంగా తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…