Categories: Movie News

ఐదు ఎకరాల్లో బంగ్లా.. 500 ఎకరాల భూములు… చివరికి చిల్లిగవ్వ కూడా లేకుండా దీన స్థితిలో కమిడియన్ !

సినిమా ఇండస్ట్రీ అంటే ఒక్కోసారి అదృష్టాన్ని తలదన్నే రంగుల ప్రపంచం. ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మలుపుతిప్పుతాయో, ఎవరు ఎత్తు నుంచి క్రింద పడతారో ఊహించలేం. కొన్ని సినిమాలు ఒక సామాన్యుడిని స్టార్‌గా మార్చితే, కొన్ని ఫెయిల్యూర్లు కోటల అధిపతిని కూడా బికారిని చేయిస్తాయి. అలాంటి విషాద కథే తమిళ నటుడు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హాస్య నటుడు సత్యన్ జీవితం.

Tamil comedian satyan real life story

‘స్నేహితుడు’, ‘తుపాకీ’, ‘భీష్మ’, ‘రాధేశ్యామ్’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సత్యన్, అసలైన పాత్ర హాస్యంలోనే కనిపించినా, ఆయన అసలు ప్రయాణం హీరోగా మొదలైంది. సూర్య నటించిన ‘కాదలే నిమ్మిది’లో చిన్న రోల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సత్యన్, 2000లో ‘ఇళయవన్’ అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. అయితే మొదటి రెండు సినిమాలే బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచగా, హీరో క్యారెక్టర్‌లో ఆశలు చిగురించకుండానే ఆయన కథనపాత్రల వైపు మొగ్గారు.

హీరోల ఫ్రెండ్ రోల్స్ చేస్తూ, తన ప్రత్యేకమైన కామెడీ స్టైల్‌తో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ఇప్పటివరకు సత్యన్ 70కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో రెండు తెలుగు సినిమాలు.. భీష్మ (నితిన్‌తో), రాధేశ్యామ్ (ప్రభాస్‌తో) ప్రముఖమైనవి. డబ్బింగ్ సినిమాలుగా వచ్చిన ‘స్నేహితుడు’, ‘తుపాకీ’ సినిమాల ద్వారా కూడా మంచి ఫ్యాన్‌బేస్ ఏర్పడింది.

అయితే అతని నటనా జీవితం కన్నా ఆశ్చర్యకరమైనది ఆయన గతం. సత్యన్ తండ్రి మాధంపట్టి శివకుమార్ కోయంబత్తూరు జిల్లా మాధంపట్టిలో ప్రముఖ భూస్వామి. వారి కుటుంబానికి ఐదు ఎకరాల్లో విస్తరించిన బంగ్లా, 500 ఎకరాల తోటలతో పాటు కోట్లాది ఆస్తులు ఉండేవి. స్థానికులు ఈ కుటుంబాన్ని చిన్న రాజవంశంగా భావించేవారు.

అయితే శివకుమార్‌కు సినిమాలపై అమితమైన ఆసక్తి ఉండేది. ఆయన నటుడు సత్యరాజ్ బంధువుగా ఉండటంతో, కుటుంబ సభ్యుల వ్యతిరేకతను లెక్కచేయకుండా సత్యరాజ్‌కు నెలవారీ స్టైఫండ్ పంపుతూ సహాయపడ్డారు. తర్వాత తానే స్వయంగా నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించారు. కానీ అవి ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆర్థిక పరిస్థితి దిగజారింది.

తన కుమారుడు సత్యన్‌ను హీరోగా నిలబెట్టాలన్న తపనతో ‘ఇళయవన్’ సినిమాను స్వయంగా నిర్మించిన శివకుమార్, ఆ సినిమా ఫెయిలైన తర్వాత తీవ్ర నష్టాల్లో పడ్డారు. దీంతో కుటుంబ ఆస్తులు ఒక్కొక్కటిగా అమ్మేయాల్సి వచ్చింది. చివరికి మాధంపట్టిలోని వారిది ఐదు ఎకరాల్లో ఉండే బంగ్లాను కూడా సత్యన్ అమ్మేశారు.

తండ్రి మరణం అనంతరం చెన్నైలో స్థిరపడ్డ సత్యన్, ప్రస్తుతం తన పూర్వీకుల సంపదను కోల్పోయి, కేవలం తన సినిమాల ద్వారా సంపాదించుకున్నదానిపైనే ఆధారపడుతున్నాడు. ఒకప్పుడు “కుట్టి రాజా” అని గౌరవంగా పిలిపించుకున్న సత్యన్, ఇప్పుడు తన కృషితో నిలబడి, జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కేవలం డబ్బు కాదు, నిరంతర శ్రమ, చక్కటి ప్లానింగ్ అవసరం. లేకపోతే ఐదు ఎకరాల బంగ్లా అయినా.. చిల్లిగవ్వగా మారిపోవచ్చు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago