కరోనా విజృంభిస్తున్న తరుణంలో పలు దేశాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. అదే క్రమంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నిషేదించారు. మన దేశంలో కూడా 23 నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతుంది. తాజగా కరోనా తీవ్రత దృష్యా లాక్ డౌన్ ను మరో 19రోజులు మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రకాల పనులతో విదేశాలకు వెళ్లిన వారు తిరిగి స్వదేశానికి రాలేని పరిస్థితి. ఈ క్రమంలో అక్కడివారి పరిస్థితిపై ఇక్కడ ఉన్న వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ఇటువంటి పరిస్థితిలోనే ఉన్నాడట ప్రముఖ తమిళ హీరో విజయ్ కుమారుడు జాన్సన్ సంజయ్ కూడా ప్రస్తుతం కెనాడలో చిక్కుకున్నాడట. దీనితో విజయ్ తన కుమారుడి పరిస్థితిపై తీవ్ర ఆందోళన చెందుతున్నాడట. గత ఏడాది చెన్నైలోని స్కూలింగ్ పూర్తి చేసుకుని ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాడు. ప్రస్తుతం సంజయ్ కెనడాలోని ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తున్నాడట. అయితే ప్రస్తుతం కెనడాలో కరోనా తీవ్రత అంతగా లేనప్పటికీ పక్కనే ఉన్న అమెరికాలో తీవ్ర దృష్యా వైరస్ తీవ్రత అన్ని దేశాలలో పెరుగుతున్నందున విజయ్ తీవ్ర ఆందోళన చెందుతున్నట్టుగా సమాచారం.
ప్రస్తుతం విజయ్ తన భార్య, కూతురుతో కలిసి చెన్నైలో తన నివాసంలో ఉంటున్నాడు. అయితే కుమారుడు సంజయ్ కి ఫోన్ చేసి తరచూ మాట్లాడుతున్నాడట. ఇంట్లోనే ఉండమని బయటకు రావద్దని హెచ్చరిస్తున్నాడట. త్వరలో సంజయ్, విజయ్ కుమారుడు ధృవ్ తో కలిసి ఒక సినిమా తెరకెక్కన్నదని ప్రచారం జరిగింది. ఇందులో నిజమెంతుందో తెలియాల్సిఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…