సాధారణంగా ఏ యువతి అయినా పెళ్లి తర్వాత గర్భం దాల్చి బిడ్డకు జన్మనిస్తుంది. కానీ తమిళనాడుకు చెందిన ఓ యువతి మాత్రం బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కింది. అయితే ఈ విధంగా వీరి పెళ్లి చేయడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం…
తమిళనాడులోని రాణిపేట జిల్లా, వాలాజాపేటకు చెందిన జ్యోతి.. అదే ప్రాంతానికి చెందిన ఉదయ్‌కుమార్ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు.ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడటంతో జ్యోతి గర్భం దాల్చింది. ఇదే విషయమే ఉదయ్ కుమార్ కి చెప్పి తనను పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో అందుకు ఉదయ్ కుమార్ నిరాకరించాడు. అదేవిధంగా ఉదయ్ కుమార్ జ్యోతికి దూరంగా ఉంటున్నాడు.
జ్యోతి గర్భం దాల్చిన విషయం తమ కుటుంబ సభ్యులకు తెలియడంతో తనకు గర్భం తొలగించాలని చూశారు. అయితే ఆమె ఆరోగ్యపరంగా ఎంతో బలహీనంగా ఉండటం చేత ఆమెకు గర్భం తొలగించడం కుదరలేదు. ఈ క్రమంలోనే నెలలు నిండడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు జ్యోతిని వాలాజాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా శనివారం జ్యోతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మనివ్వగానే ఆ బిడ్డను అక్కడే వదిలి పారిపోవాలని చూసిన జ్యోతికి ఆరోగ్యం సహకరించక ఆస్పత్రిలోనే కుప్పకూలిపోయింది.
ఈ విషయం గమనించిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో జ్యోతి అసలు విషయం చెప్పింది. ఈ క్రమంలోనే పోలీసులు ఉదయ్ కుమార్ ను పిలిపించి.. జ్యోతిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. లేదంటే తనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తోందని చెప్పడంతో ఉదయ్ కుమార్ పెళ్లికి అంగీకరించారు. ఈ విధంగా తన బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే జ్యోతి పెళ్లి పీటలు ఎక్కింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…