General News

భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లలను చంపి భార్య ఆత్మహత్య!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమైన నేపథ్యంలో కరోనా వైరస్ ఎంతోమంది పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టిందని చెప్పవచ్చు.వైరస్ బారిన పడి కొందరు చనిపోతే వారి మరణాన్ని తట్టుకోలేక మరి కొందరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటన తమిళనాడు రాష్ట్రంలో ఒకటి చోటు చేసుకుంది.భర్త కరోనాతో మరణించాడని కుంగిపోయిన భార్య తన పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మాంగాడుకు చెందిన భాస్కర్‌, నిత్య దంపతులు నివసించేవారు. వీరికి కుమార్తె మహతి, కుమారుడు యాదవ్ కృష్ణ అనే పిల్లలు ఉన్నారు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న వీరి కుటుంబంలో కరోనా చిచ్చు పెట్టింది. గత నెల రెండవ తేదీన భాస్కర్ కరోనా బారిన పడగా అతడు చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 9వ తేదీన మృతి చెందాడు.

తన భర్త భాస్కర్ మృతి చెందడంతో నిత్య శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఈరోడ్‌లో ఉన్నటువంటి తన పుట్టింటికి వెళ్ళింది.తన పుట్టింటికి వెళ్ళిన నిత్య తన భర్త ఇక లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది.తన భర్త లేని జీవితం తనకు అవసరం లేదని భావించిన నిత్య కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం భోజనంలో తన పిల్లలకు విషం కలిపి తినిపించి తాను కూడా గదిలోకి వెళ్లి ఆత్మ హత్యకు పాల్పడింది. ఆలస్యంగా గమనించిన తన తండ్రి పార్థసారధి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ముగ్గురి శవాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

23 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago