Chiranjeevi: ఏపీలో టికెట్ రేట్లపై, టాలీవుడ్ సమస్యలపై ఏపీ ప్రభుత్వంతో సినీ ప్రముఖులు చర్చించిన విషయం తెలిసిందే. ఏపీలో గత రెండు నెలల నుంచి తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తూనే ఉంది. అయితే ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో.. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, నారాయణ మూర్తి, అలీ, పోసాని, కొరటాల శివ వంటి ప్రముఖులు భేటీ అయ్యారు.
ఇండస్ట్రీలో నెలకొని ఉన్న సమస్యలను గురించి ప్రభుత్వానికి వివరించారు. అయితే ఈ భేటీలో టికెట్ ధరలపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు కూడా చెప్పారు స్టార్ హీరోలు. అయితే ఇప్పడు ఇదే అంశం చాలా చర్చనీయాంశం అయింది.
స్టార్లు అని చెప్పుకునేవారు ఇలా చేతులు జోడించి అడుక్కోవడం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే వివాదాస్పద డైరెక్టర్.. ఆర్జీవీ ఈ భేటీపై వ్యంగ్యంగా వరసగా ట్విట్లు చేశారు. సాధారణ ప్రజా ప్రతినిధి జగన్, పేర్ని నాని ముందు మన హీరోలంతా జీరో అయ్యారని వ్యాఖ్యానించారు. మెగా, సూపర్, రెబెల్ స్టార్లంతా… ఓమెగా స్టార్(జగన్) ముందు తక్కువే అన్నట్లు వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఈ అంశంపై మాట్లాడారు. తన యూట్యూబ్ ఛానెల్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి చేతులు జోడించి జగన్ ను వేడుకున్నట్లు ఒక వీడియో లీకైంది. ఆ వీడియో గురించి తమ్మారెడ్డి స్పందిస్తూ టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి తొలి అడుగు వేశారని అన్నారు. చిరంజీవి ఇండస్ట్రీ బిడ్డ అని చెప్పినా మేము ఆయనను ఇండస్ట్రీ పెద్దగా భావిస్తామని తమ్మారెడ్డి తెలిపారు. అయితే మనకంటూ ఆత్మగౌరవం ఉందని.. మనం అడుక్కునే స్థాయికి దిగజారాలా.. ఈ వీడియోని చూస్తే చిరంజీవి అడుకున్నట్లుగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. పరువు తీశావయ్యా చిరంజీవి అంటూ వ్యాఖ్యానించాడు. టికెట్ రేట్లు పెరగడం వల్ల ట్రిపుల్ ఆర్ సినిమాకు మరో రూ. 15 కోట్లు అదనంగా రావచ్చని.. ఆ సినిమా రేంజ్ కు అతి నథింగ్ అని ఆయన అన్నారు. మెగాస్టార్ వంటి పెద్ద హీరో ఇలా అడుక్కోవడం బాధగా అనిపించిందని.. ఆయన అన్నారు. ప్రస్తుతం తమ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…