Categories: FeaturedMovie News

Tanikella Bharani : నా డబ్బులు కాజేసి నన్నే ఇంట్లోంచి బయటకు గెంటేసాడు.. వాడికి పక్షవాతం వచ్చింది : తనికెళ్ళ భరణి

Tanikella Bharani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిన్న అద్భుతమైన పాత్రలో తెలుగు, కన్నడ, హిందీ, భాషలలో సుమారు 750 చిత్రాలకు పైగా నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తండ్రి పాత్రలో తాత పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన తనికెళ్ల భరణి ఇంటర్వ్యూలో భాగంగా తన సినిమా కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనికెళ్ళభరణి ఒక ఫైట్ మాస్టర్ తనని దారుణంగా అవమానించారని ఈ సందర్భంగా తెలియజేశారు. తనికెళ్ల భరణి వివాహం చేసుకొని మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు తను రాళ్ళపల్లి ఇంటిలో అద్దెకి ఉండేవారని చెప్పారు. అయితే ఆ ఇంటికి వచ్చిన ఫైట్ మాస్టర్ భీమరాజు అనే వ్యక్తి ఏంటయ్యా కొత్తగా పెళ్లయింది ఈ చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నారు, నాకు పెద్ద ఇల్లు ఉంది గ్రౌండ్ ఫ్లోర్ అమ్మాలి అనుకుంటున్నాను కావలిస్తే చూడండి అంటూ తనకు చెప్పారనీ తనికెళ్ల భరణి తెలియజేశారు.

Tanikella Bharani: అలా నటించినందుకు చంపేస్తామని బెదిరించారు…ఆవేదన వ్యక్తం చేసిన తనికెళ్లభరణి..!

అయితే గ్రౌండ్ ఫ్లోర్ ను ఏకంగా మూడు లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు ఫైట్ మాస్టర్ చెప్పగా మూడు లక్షలు అంటే ఎక్కడి నుంచి తేవాలి చాలా కష్టం అవుతుందని తనికెళ్ళభరణి చెప్పడంతో అసలు డబ్బులు ఇవ్వకుండా వచ్చి ఇంట్లో చేరిపో నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వమని చెప్పారు.ఇదే విషయాన్ని తనికెళ్ల భరణి తన గురువుగారి దగ్గర చెప్పడంతో ఒకసారి వెళ్లి చూసి రా మంచి విషయమే కదా అని చెప్పారు.

ఈ విధంగా అప్పట్లోనే లక్ష రూపాయలు చెల్లించి ఒక సంవత్సరం పాటు ఆ ఇంట్లో ఉండగా ఒక ఆరు నెలల పాటు తనకి ఎలాంటి అమౌంట్ రాలేదని అప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఫైట్ మాస్టర్ వచ్చి తన ఇంటికి చెల్లించాల్సిన డబ్బులు మొత్తం చెల్లించాలని ఎంతో ఒత్తిడికి గురి చేశారని చెప్పారు.ఇప్పటికిప్పుడు అంత మొత్తంలో డబ్బు కంటే ఎక్కడనుంచి తీసుకురావాలి నా పరిస్థితి కూడా ఇదే అని చెప్పినప్పటికీ వినకుండా వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమన్నారు.

అతను ఆ మాట అనేసరికి తనికెళ్ళ భరణి తన డబ్బులను తనకు తిరిగి ఇవ్వమని అడిగిన కూడా ఇవ్వకుండా తన ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు. ఆ విధంగా అక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్ళిన తనికెళ్ల భరణి తన డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ విధంగా డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతని దగ్గర నుంచి 75 వేల వరకు తిరిగి తీసుకున్నానని అప్పటికే అతనికి పక్షవాతం వచ్చి ఇబ్బందులు పడటంతో మిగిలిన పాతిక వేలు వదులుకున్నానని ఇంటర్వ్యూ సందర్భంగా తనికెళ్ళభరణి తెలియజేశారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago