Taapsee: మెగాస్టార్ చిరంజీవిని చూడగానే చిన్నపిల్లలా మారిపోయిన తాప్సీ.. ఆనందానికి అవధులు లేవు!
Taapsee: ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సొట్ట బుగ్గల చిన్నది తాప్సి తెలుగులో పలు చిత్రాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈమె తిరిగి తెలుగు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది.
స్వరూప్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం మిషన్ ఇంపాజిబుల్. ఈ సినిమా ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
లేకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు మార్చి 30వ తేదీ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డికి, మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమాకి కూడా నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇక ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి రావడంతో తాప్సి చిన్న పిల్లగా మారిపోయి పెద్ద ఎత్తున సందడి చేసింది. మెగాస్టార్ రావడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈక్రమంలోనే ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవిని చూసిన తాప్సీ వెంటనే అతనిని హగ్ చేసుకొని సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు విషయాల గురించే తాప్సి ముచ్చటించారు.ఇలా వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్లో చూడటంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె ఈ సినిమా గురించి వేదికపై మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…