Hero Suhas: మెగాస్టార్ నోటివెంట తన పేరు రావడంతో ఎమోషనల్ అయిన హీరో సుహాస్… సినిమా నచ్చిందంటూ ప్రశంసలు!
Hero Suhas: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్‌జే. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సినిమా మంచి విజయం అందడంతో ఎంతో మంది నిర్మాతలు చూపులు తన వైపు తిప్పుకున్నారు. ఈ క్రమంలోనే మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్.
ఈ సినిమాలో తాప్సీ కీలక పాత్రలో నటించారు.ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ ఒకటో తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే మార్చి 30వ తేదీ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇక ఈ వేదికపై మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఇకపోతే ఈ ఫ్రీ రిలీజ్ వేదిక పై మెగాస్టార్ చిరంజీవి కలర్ ఫోటో హీరో సుహాస్ పై ప్రశంసలు కురిపించారు.ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరో ఫ్రెండ్ గా నటించి మెప్పించిన సుహాస్ కలర్ ఫోటో సినిమా ద్వారా హీరోగా మంచి గుర్తింపు పొందారు.
మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో కూడా సుహాస్ కీలక పాత్రలో నటించారు. ఈ సందర్భంగా ఈయన పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. కరోనా పాండమిక్ సమయంలో భాగంగా తన సినిమాలన్నింటినీ చూశానని ముఖ్యంగా కలర్ ఫోటో సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి నోటివెంట తన పేరు రావడమే కాకుండా తన పై ప్రశంసలు కురిపించడంతో సుహాస్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం సుహాస్ మరో రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…