Categories: FeaturedMovie News

శ్రీదేవి పిలిచిందని ముంబై వెళ్లిన ఈ తెలుగు దర్శకుడు.. తీరా చూస్తే పప్పులో కాలేశారు. ?!

అక్కినేని నాగేశ్వరరావును చూసి హీరో అవుదామని అనుకొని రైలెక్కి మద్రాసు వచ్చారు. ఎన్నో ఆఫీసులు, స్టూడియోల చుట్టూ తిరిగిన సినిమాల్లో అవకాశం రాలేదు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పది సంవత్సరాలు పనిచేసి.. ఆ తర్వాత 1980, పూర్ణ చందర్రావు నిర్మాతగా, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “సంధ్య” చిత్రం విడుదలైంది. సినిమాలో శ్రీధర్, సుజాత, చంద్రమోహన్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

ఆ తర్వాత న్యాయంకావాలి, కిరాయి రౌడీలు, ప్రళయ రుద్రుడు, ప్రేమ మూర్తులు, కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, శ్రీరంగనీతులు, అభిలాష, అనుబంధం, ఇల్లాలు ప్రియురాలు, గూండా, కంచు కాగడా, దొంగ మొగుడు, కోడెత్రాచు, దాంపత్యం, మహాసంగ్రామం, విజేత, రక్తసింధూరం, అనసూయమ్మ గారి అల్లుడు, ఖైదీ రుద్రయ్య, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, రాక్షసుడు, భానుమతి గారి అల్లుడు లాంటి విజయవంతమైన చిత్రాల అనంతరం.. మెగాస్టార్ చిరంజీవితో మరో ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.

1989 గీతా ఆర్ట్స్, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “అత్తకి యముడు అమ్మాయికి మొగుడు” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. చక్రవర్తి అందించిన గీతాలు ప్రేక్షకాదరణ పొందాయి. అత్తా అల్లుళ్ళ సవాల్ తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మొదటిసారిగా “కిరాయికోటిగాడు” చిత్రంలో కృష్ణ సరసన శ్రీదేవి హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత కంచు కాగడా, కోడెత్రాచు చిత్రాల్లో శ్రీదేవి తిరిగి హీరోయిన్ గా నటించారు. షూటింగ్ విరామ సమయంలో.. బాలీవుడ్ లో చిత్రాలు చేయాలని శ్రీదేవి, కోదండ రామిరెడ్డిని అడిగేవారు. ఆ తర్వాత శ్రీదేవి ముంబై వెళ్లి హిందీ చిత్రాలు నటిస్తున్నప్పుడు.. నిర్మాతల ద్వారా ముంబై రావాలంటూ కోదండరామిరెడ్డికి కబురు పంపేది.

అయితే ఎన్నిసార్లు శ్రీదేవి ఆఫర్ చేసినా కూడా కోదండరామిరెడ్డి ముంబై వెళ్ళపోవడానికి కారణం ఆయనకు హిందీ భాష సరిగా రాకపోవడం. అలా ఆయనా బలవంతంగా హిందీలో ఒక తెలుగు చిత్రాన్ని రీమేక్ చేయడం జరిగింది. 1990 విజయలక్ష్మి పిక్చర్స్, టి త్రివిక్రమరావు నిర్మాణం, ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “జమైరాజా” అనే హిందీ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ హీరో, హీరోయిన్లుగా నటించారు. మరో ప్రధాన పాత్రలో హేమామాలిని కనిపించారు.

అయితే ఈ చిత్రం తెలుగులో ఘనవిజయం సాధించగా హిందీలో పరాజయం పొందింది. అత్తా అల్లుళ్ళ సవాల్ తో కూడిన ఈ రైవల్రీ స్టోరీ సౌత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. కానీ నార్త్ లో అత్తా అల్లుళ్ళ మధ్య రైవల్రీ ఉండదు. కావున నార్త్ ఆడియన్స్ కు కనెక్ట్ కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద “జమైరాజా” పరాజయం పొందింది. ఆ తర్వాత ఎ.కోదండరామిరెడ్డి మరే ఇతర బాలీవుడ్ చిత్రాన్ని రూపొందించలేదు. తాను బాలీవుడ్ లో ఎక్కువ చిత్రాలు తీయక పోవడానికి ప్రధాన కారణం హిందీ భాష రాక పోవడమేనని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago