Taraka Ratna : ఒకటో నెంబర్ కుర్రాడిగా తెలుగు సినిమా పరిశ్రమకు నందమూరి వారసుడిగా వచ్చిన తారకరత్న ఏకంగా 9 సినిమాలను ఏక కాలం లో ఒప్పుకుని సంచలనం అయ్యారు. దాదాపు 23 సినిమాల్లో నటించిన ఆయన 2001 లో తన కెరీర్ మొదలుపెట్టిన ఎందుకో అంత సక్సెస్ కాలేక పోయారు. కానీ 2000 సంవత్సరం ఆ టైములో తారక రత్నను జూనియర్ ఎన్టీఆర్ ను నిలువరించడానికే సినిమాల్లోకి దించారనే ప్రచారం ఉండేది. జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం కలుపుకోక పోవడం వారి వ్యక్తిగత విషయాలు ఇందుకు కారణాలుగా చెప్పేవారు.
తమ్ముడితో నాకు మంచి అనుబంధం ఉంది…..
కానీ ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఎన్టీఆర్ తెలుగులో టాప్ హీరోలలో ఒకడిగా ఉన్నాడు. ఇక నందమూరి వారసత్వాన్ని బాలయ్య తరువాత తన భుజస్కందాలపై మోస్తున్నాడు. ఇక తారకరత్న హీరోగా అంత సక్సెస్ కాలేదు కానీ రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి సినిమాలో సైకో పాత్రలో నటనకు నంది అవార్డు సొంతం చేసుకున్నారు. కానీ ఆతరువాత సినిమాల్లో ఎక్కువ కనిపించలేదు. ఇక ఆ మధ్య దేవినేని సినిమాలో మళ్ళీ కనిపించినా ఎవరూ అంత పట్టించుకోలేదు. ప్రస్తుతం 9 హవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించిన తారకరత్న ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ నందమూరి కుటుంబంపై ఆసక్తికర విషయాలు మాట్లాడారు.
ఇక ఎన్టీఆర్ కి పోటీగా మిమ్మల్ని సినిమాల్లోకి దించారా అన్న ప్రశ్నకు 2000 సంవత్సరంలో నేను సినిమాల్లోకి వచ్చే సరికి ఎన్టీఆర్ ఆది లాంటి పెద్ద హిట్ తో మాస్ ఇమేజ్ ఉన్న హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడని, సినిమాల్లోకి రావడం నా కల అని అందుకే వచ్చానని చెప్పారు. ఇక ఎన్టీఆర్ తో అనుబంధం గురించి ప్రశ్నించగా సాధారణంగా అందరిలాగానే మా మధ్య అన్నదమ్ములుగా మంచి అనుబంధం ఉందని కలిసినపుడు ఆనందంగా గడుపుతామని చెప్పారు. ఇక ఎన్టీఆర్ బార్న్ యాక్టర్ అని, ఇపుడు ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటుల్లో ఎన్టీఆర్ ఒకరని ప్రశంసించారు. ఇక తారక రత్న వెబ్ సిరీస్ 9 హావర్స్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతూ ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…