Taraka Ratna : నందమూరి ఇంటి నుండి నట వారసుడిగా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తారక రత్న, 2002 లో వచ్చిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకేసారి తొమ్మిది సినిమాలకు సైన్ చేసిన తారక రత్న అప్పట్లో అదొక అరుదైన రికార్డు క్రియేట్ చేసాడు. కానీ ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తరువాత చేసిన సినిమాలేవి చెప్పుకొదగ్గ హిట్ సినిమాలుగా మిగల్లేదు. దీంతో కెరీర్ సవ్యంగా సాగలేదు.
మా బాబాయ్, నా తమ్ముడిలా నటించలేను.. నా స్టైల్ నాకుంది….
ఇక కెరీర్ లో 23 సినిమాలు చేసినా తారక రత్న హీరోగా సిని ఇండస్ట్రీలో నిలబడలేకపోయాడు. ఇక అమరావతి సినిమాలో విలన్ గా ఒక సైకో క్యారెక్టర్ లో మాత్రం తన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2021 లో వచ్చిన దేవినేని సినిమాలో మళ్ళీ ప్రేక్షకులకు కనిపించాడు తారక రత్న. ఇక నందమూరి ఇంట సినిమా వారసులుగా తమ వారసత్వాన్ని నిలబెడుతున్న బాబాయ్ అబ్బాయ్ లు బాలకృష్ణ, ఎన్టీఆర్ ల గురించి తారక రత్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. నటనలో బాబాయ్, నా తమ్ముడు ఎన్టీఆర్ లా నేను నటించలేను, నాకంటూ ఒక స్టైల్ ఉంది. దర్శకులు చెప్పిన విధంగా వారికి ఏం కావాలో అది మాత్రమే చేయగలను అంటూ చెప్పాడు.
ఇక తాజాగా తారకరత్న 9 హవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన తారకరత్న ఇలాంటి ఆసక్తికరమైన వాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబంలోకి ఆహ్వానించడానికి చాలా సమయమే పట్టింది. తన సొంత సక్సెస్ తో ఎన్టీఆర్ తన కుటుంబానికి కూడా దగ్గరైన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇపుడు తారక రత్న ఇలా నా తమ్ముడు అంటూ వాక్యాలు చేయడంతో నందమూరి అభిమానులు ఖుషి అవుతున్నారు. నందమూరి కుటుంబం అంతా ఒకటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…