Suma Kanakala : సుమ కనకాల… తెలుగు ప్రేక్షకులలో ఈ పేరు తెలియని వారు వుండరు. తెలుగు బుల్లితెర మీద ఛానల్ తో సంబంధం లేకుండా కొన్ని వందల ప్రోగ్రాంలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. బుల్లితెర మీద ఏ ఛానల్ చూసినా ఎక్కువ శాతం సుమ ప్రోగ్రాం కనిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. బుల్లితెర మీదనే కాకుండా అప్పుడప్పుడు సినిమాలలోనూ, ప్రీరిలీజ్ వేడుకలలోనూ బిజీగా ఉంటుంది.
అయితే మే 30 2021 న సుమ అనే పేరుతో సుమ కనకాల ఒక యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. మొదలుపెట్టిన అనతికాలంలోనే నాలుగున్నర లక్షలకు పైగా సబ్ స్క్రైబర్ లను పొందింది. సుమ తనకు సంబందించిన అన్ని విషయాలను వీడియోలుగా అభిమానులతో పంచుకుంటోంది. సుమ హోస్ట్ చేస్తున్న ప్రోగ్రాంలలో క్యాష్ ప్రోగ్రాం కూడా ఒక్కటి. ఇది ఎంతటి ప్రజాదారణ పొందిందో అందరికి తెలిసిందే. అయితే తాజాగా సుమ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా క్యాష్ ప్రోగ్రాంకు సంబందించిన ఒక వీడియోను షేర్ చేసింది.
క్యాష్ ప్రోగ్రాం షూటింగ్ రోజు సుమ ఏం చేస్తుందో…..
బుల్లితెర మీద ప్రసారమవుతున్న ప్రోగ్రాంలలో టాప్ రేటెడ్ ప్రోగ్రామ్లలో ఒకటిగా సాగుతోంది. ప్రతి వారం నలుగురు సెలబ్రిటీలతో సుమ చేసే హంగామా మాములుగా ఉండదు. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఆమె హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రాం తెర వెనుకకు సంబంధించిన వ్లాగ్‌ను వీడియో చేశారు. సుమ యూట్యూబ్ ఛానల్ వేదికగా ఈ ప్రోగ్రాంను షేర్ చేశారు. క్యాష్ ప్రోగ్రామ్ షూటింగ్ ఉన్న రోజు సుమ ఉదయం ఎన్నింటికి ఇంటి నుండి స్టార్ట్ అవుతారు? షూటింగ్‌లో ఆమె మేకప్ వేసుకొనే సమయం ఎలా ఉంటుంది?… సెట్స్‌లో సుమ ఎలా ఉంటుంది? షూటింగ్ అయిపోయాక ఫోటో షూట్లు ఎలా ఉంటాయి? ఇలాంటి అన్నింటికి సంబందించిన విషయాలను వీడియో తీసి పెట్టారు. ప్రస్తుతం ఈ క్యాష్ ప్రోగ్రాం కి సంబందించిన వీడియో యూట్యూబ్లో ట్రెండింగ్‌లో ఉంది.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…