Actors Satish: సీత గారితో రెండో పెళ్లి.. మగ పిల్లాడు.. సీత గారి కోట్ల ఆస్తి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన యాక్టర్ సతీష్!
Actors Satish: ప్రముఖ సీరియల్ నటుడిగా అందరికీ ఎంతో సుపరిచితమైన నటుడు సతీష్ మొదటిసారిగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని గతంలో తన గురించి వచ్చిన వార్తల గురించి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ నటి సీత తన భర్తకు విడాకులిచ్చి అనంతరం యాక్టర్ సతీష్ పెళ్లి చేసుకున్నారని ఆయన తన ఆస్తిపాస్తులను లాక్కుని తనని ఎంతో ఆర్థిక ఇబ్బందులకు గురి చేశారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అదేవిధంగా సీత తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత వీరి వద్ద ఉన్న అబ్బాయి ఎవరు అనే విషయం గురించి కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సతీష్ వీరి గురించి వచ్చిన ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీలో మా మధ్య ఏదో రిలేషన్ ఉందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే మా మధ్య కేవలం మంచి కల్మషంలేని స్నేహబంధం మాత్రమే ఉందని ఈ సందర్భంగా సతీష్ వెల్లడించారు.మీడియాలో ఇలా మా గురించి వస్తున్న వార్తలను చూసి ఎంతో సరదాగా నవ్వుకున్నాం తప్ప మాకు ఎప్పుడు కోపం బాధ రాలేదని సతీష్ వెల్లడించారు.
ఇక సీత తన భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటికి తనకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మరి ఆ బాబు ఎవరు అనే విషయానికి వస్తే సీత ఒక పిల్లాడిని దత్తత తీసుకున్నారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇకపోతే సీత ఆస్తిపాస్తులు అన్నింటినీ తాను తీసుకున్నానని తనని ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురి చేశానని వార్తలపై కూడా స్పందించి ఈయన క్లారిటీ ఇచ్చారు.
మా గురించి తన ఆస్తిపాస్తులను గురించి పేపర్లో రావడం చూసి సీత తనతో ఏంట్రా నువ్వు నా ఆస్తులన్నీ లాగేసుకున్నావట, నన్ను ఎక్కడో ఒక చిన్న ఇంట్లో పెట్టారట అంటూ తనతో చెప్పి గట్టిగా నవ్వారని ఈ సందర్భంగా సతీష్ వెల్లడించారు. ఇలా మా గురించి వస్తున్న వార్తలలో ఏది ఇది నిజం కాదని తన ఆస్తిపాస్తులను అలాగే ఉన్నాయని తెలిపారు.ఇకపోతే సతీష్ తన ఆస్తుల గురించి చెబుతూ తాను ఇతరులకు దానధర్మాలు చేయకుండా ఆస్తులని పోగు చేసుకొని ఉంటే ఇప్పటికి సుమారు 200 కోట్ల రూపాయల ఆస్తి ఉండేదని, ఆపదలో ఉన్నారని తెలిస్తే వారికి తప్పకుండా డబ్బులు ఇచ్చేవాన్ని అయితే చేసిన సహాయం ఎక్కడ తనకు చెప్పుకునే అలవాటు లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…