Movie News

Tarakaratna: తారకరత్న చిన్న కర్మలో ఎమోషనల్ అయిన అలేఖ్య రెడ్డి… తల్లిని ఓదారుస్తున్న కూతురు నిష్క!

Tarakaratna: నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై 23 రోజులు పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మృత్యులతో పోరాడారు. అయితే ఈ పోరాటంలో తారకరత్న ఓడిపోక తప్పలేదు.ఇలా 23 రోజులు పాటు మృత్యువుతో పోరాడిన ఈయన ఫిబ్రవరి 18వ తేదీ కన్నుమూశారు.ఈ విధంగా తారకరత్న మరణ వార్త నందమూరి కుటుంబంలోనూ అభిమానులను తీవ్ర విషాదం నింపింది.

ఇక ఈయన మరణించడంతో కుటుంబ సభ్యులు తారకరత్న చిన్న కర్మను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తారకరత్న తల్లిదండ్రులతో పాటు తన సోదరి హాజరయ్యారు. అలాగే నందమూరి బాలకృష్ణ కుటుంబం కళ్యాణ్ రామ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరి కూడా ఈ చిన్న కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా నందమూరి నారా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక తారకరత్న చిన్న కర్మలో భాగంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక తారకరత్న తిరిగిరారనే నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే తన భర్తను గుర్తు చేసుకుంటూ ఏకధాటిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే తనను ఓదార్చడం కోసం కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా తనని ఆపడం ఎవరి తరం కాలేదు.

Tarakaratna: ఏకధాటిగా కన్నీళ్లు పెట్టుకున్న అలేఖ్య…

ఇక అలేఖ్య రెడ్డి తన భర్తను తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉండగా తన పెద్ద కుమార్తె నిష్క సైతం తన తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరినీ బాలకృష్ణ తన అన్నయ్య మోహన్ కృష్ణతో కలిసి స్వయంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

10 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

10 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

10 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

10 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

10 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

13 hours ago