Tarakaratna Daughter: నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మరణించిన విషయం మనకు తెలిసింది. అయితే ఈయన మరణించినప్పటికీ ఈయన కుటుంబ సభ్యులు తన మరణ వార్త నుంచి బయటపడలేకపోతున్నారు.కుటుంబ సభ్యులను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తారకరత్న ఇలా ప్రేమించిన అమ్మాయిని అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిపోవడంతో అలేఖ్య రెడ్డి తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
ఇలా తన భర్త జ్ఞాపకాలనుంచి బయటపడలేనటువంటి అలేఖ్య తన పెద్ద కుమార్తె నిషిక తరచూ తారకరత్న గురించి తనతో వారికి ఉన్న అనుబంధం గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.తాజాగా తారకరత్న కుమార్తె నిషిక తన తండ్రితో కలిసి ఆడుకున్నటువంటి చివరి క్షణాలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్న హిందూపురం వెళ్లే ముందు తనతో కలిసి వీడియో గేమ్ ఆడినట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన వీడియోని నిషిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ హిందూపురం వెళ్లడానికి ముందు తన తండ్రి తనతో కలిసి ఆడిన గేమ్ అంటూ ఈమె ఈ వీడియోని షేర్ చేశారు.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు మిస్ యు సో మచ్ తారక్ అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈయన లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొని ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోవడంతో గుండెపోటుకు గురయ్యారు. ఇలా 23 రోజులపాటు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…