AP politics: ఏపీ ఎన్నికల తేదీ ప్రకటనలు రాకముందే ఎన్నికల వేడి రాజు కుంది. సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున రాజకీయాలు జరుగుతూ పార్టీకే ముప్పు తెచ్చేలా పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ఎన్నికల బరిలోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సీట్లను జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు కేటాయించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే తాజాగా చంద్రబాబు నాయుడు రెండో జాబితాను విడుదల చేశారు ఇదివరకే 99 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసినటువంటి చంద్రబాబు నాయుడు రెండో జాబితాను కూడా విడుదల చేశారు. అయితే ఈ రెండో జాబితా పార్టీ నేతలలోనూ కార్యకర్తలలోనూ పెద్ద ఎత్తున చిచ్చు రేపింది.
రెండో జాబితాలో ఆయన తమ పేరు ఉంటుందని ఆశించినటువంటి పలువురు సీనియర్లకు ఈసారి తీవ్ర నిరాశ ఎదురయింది. ఈ క్రమంలోనే ఎంతోమంది సీట్లు రాలేదన్న ఆవేదనతో పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలలో టిడిపికి జనసేన పార్టీకి తీవ్రస్థాయిలో వ్యతిరేక సెగ తగులుతుంది.
టీడీపీకి రాజీనామా..
పలు నియోజకవర్గాలలో ఆశించిన వారికి టికెట్లు రాకపోవడంతో మనస్థాపానికి గురైనటువంటి కొంతమంది నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో చంద్రబాబు నాయుడుకి జనసేనానికి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది ఇక మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు పేరు రెండో జాబితాలో లేకపోవడంతో ఈయన కూడా అలక మానలేదని తెలుస్తుంది. అయితే ఇలా అలిగిన వారందరినీ పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి వారందరికి చంద్రబాబు స్వయంగా ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…