Geethanjali: తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు కారణంగా ఓ గృహిణి ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి మనకు తెలిసిందే. కేవలం తనకు జగనన్న ఇల్లు పట్టా ఇచ్చారని తనకు జగన్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందాయనే సంతోషంగా చెప్పడమే ఆమె పాలిట శాపంగా మారింది.
ఇలా తెనాలికి చెందిన గీతాంజలి తన సంతోషాన్ని పంచుకోవడంతో ఆ విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి పచ్చ సైకోలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఆమెను మానసికంగా హింసించారు. దీంతో ఈమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇలా తనని మానసికంగా కృంగబాటకు గురిచేసినటువంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
గీతాంజలి కేసు విషయంలో పోలీసులు కూడా దూకుడు కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబును విజయవాడలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. గురువారం ఉదయాన్నే ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు తమతో రావాలని చెప్పారు.
ట్రోల్స్ వల్లే గీతాంజలి చనిపోయింది..
తనకు ముందస్తు నోటీసులు ఏమాత్రం అందడం లేదని తాను రానని, నోటీసులు పంపిస్తే ఎక్కడికి రమ్మన్నా వస్తాను అంటూ రాంబాబు మొండి చేసినప్పటికీ పోలీసులు తనని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. ఇలా ఈ కేసు విషయంలో టిడిపి నేతలు అరెస్ట్ అవుతున్నటువంటి తరుణంలో ఈమె ఆత్మహత్యకు టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలే కారణమని స్పష్టంగా అర్థమవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…