Featured

TDP – Janasena : చంద్రబాబు – పవన్ ముచ్చటగా మూడోసారి భేటీ.. గంటన్నర భేటీలో అసలేం జరిగింది.. లెక్క తేలిందా..!?

TDP – Janasena : ఎందుకోగానీ హస్తిన పర్యటన అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైలెంట్ అయ్యారు. ఎక్కడా ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు. మాజీ మంత్రి వివేకా హత్యపై ఇంత రాద్దాంతం జరుగుతున్నా కూడా ఆయన పెదవి విప్పలేదు. అలాంటి పవన్ సడెన్‌గా టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న పవన్.. సడెన్‌గా అది కూడా ఒంటరిగా వెళ్లి చంద్రబాబును కలిశారు. ఇద్దరూ ఏకాంతంగా గంటన్నర పాటు భేటీ అయ్యారు. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి మధ్య సమావేశం నడిచింది. దీనిపై పెద్ద ఎత్తున ఏపీలో కలకలం రేగింది. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా గగ్గోలు పెట్టింది. రకరకాల ఊహాగానాలతో మీడియా కథనాలను వండి వార్చి వడ్డించింది. అసలు వీరిద్దరి భేటీలో ఏఏ అంశాలు చర్చకు వచ్చాయి? సడెన్‌గా చంద్రబాబు బీజేపీ పల్లవి ఎందుకు అందుకున్నారు? చంద్రబాబు బీజేపీ పల్లవికి.. పవన్‌తో భేటీకి ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలపై ఒక లుక్కేద్దాం.

ఆ తరువాత టీడీపీ విధానంలోనూ మార్పు..

గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించేవారు. ఈ సారి అంటే ముచ్చటగా మూడోసారి భేటీ అయిన తరువాత మాత్రం ఎలాంటి ప్రెస్‌ మీట్ నిర్వహించలేదు. కేవలం భేటీ జరిగినట్టు ఫోటోలు, వీడియోలు మాత్రం విడుదల చేశారు. ఇక అది మొదలు మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఎవరికి తోచిన విధంగా వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మీడియా సైతం రకరకాల ఊహాగానాలతో కథనాలను ప్రసారం చేసింది. కొద్ది రోజుల క్రితం పవన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో భేటి అయ్యారు. ఆ తరువాత టీడీపీ విధానంలోనూ మార్పు వచ్చింది. ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు.. ప్రధాని మోదీపై జాతీయ మీడియా సాక్షిగా ప్రశంసల జల్లు కురిపించారు. అప్పటి నుంచి మొత్తానికి తెర వెనుక ఏదో జరుగుతోందంటూ రాజకీయవ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక నిన్నటికి నిన్న పవన్, చంద్రబాబు ఏకాంత భేటీ.. మొత్తానికి ఏదో జరుగుతోందనే విషయం మాత్రం అర్ధమైంది. ఈసారి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనేది మాత్రం నిన్నటితో ఫిక్స్ అయిపోయింది.

ఢిల్లీ పెద్దల సందేశాన్ని పవన్ వినిపించారా?

గత ఎన్నికల్లో ఓట్లు చీలిపోవడంతో అటు టీడీపీ, ఇటు జనసేన తీవ్రంగా నష్టపోయాయి. ఈసారి ఈ పొరపాటు మరోసారి జరగకుండా ఇరు పార్టీలు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పవన్, చంద్రబాబు భేటీలో ముఖ్యంగా పొత్తుల వ్యవహారంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే చంద్రబాబుకు ఢిల్లీ పెద్దల సందేశాన్ని పవన్ వినిపించారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. కర్ణాటక ఎన్నికల అనంతరం రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోందనేది తెలుస్తుందని.. ఆ తరువాత మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వివిధ వర్గాల వారి నుంచి వస్తున్న ఫీడ్‌ బ్యాక్‌, అధికార పార్టీ తన ప్రచారానికి అమలుచేస్తున్న వ్యూహం… దానిని ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణ కూడా చర్చకు వచ్చినట్లు టాక్ నడుస్తోంది. వీటితో పాటు రాష్ట్రంలో బీజేపీని మిత్రపక్షంగా తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వేయాల్సిన అడుగులపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

బీజేపీ కూడా హ్యాండిస్తే పరిస్థితి ఏంటి?

మొత్తానికి టీడీపీ, జనసేన అయితే పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ కూడా పొత్తులో భాగమవుతుందని టాక్ మరింత బలపడింది. ఈ నేపథ్యంలో వైసీపీలో ఆందోళన తలెత్తుతోంది. ఇప్పటి వరకూ జగన్‌కు అండగా పీఎం మోదీ ఉన్నారు. చాలా విషయాల్లో ఆయన్ను గట్టెంక్కించారనే టాక్ కూడా ఉంది. కేసుల విషయంలో అయితే నేమి.. అప్పుల విషయంలో అయితేనేమి.. మరికొన్ని కీలక విషయాల్లో జగన్‌కు కేంద్రం సపోర్ట్ ఉందని టాక్ నడిచింది. మరి ఇప్పుడు బీజేపీ.. టీడీపీతో చేరితే వైసీపీ పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ విషయంలో బీజేపీ.. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇక మీదట మరో లెక్క ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే అటు బాబాయి వైఎస్ వివేకా హత్య, ఏపీలో రోడ్లు, ఉద్యోగాలు సహా పలు విషయాల్లో వైఫల్యం అనేది జగన్ మెడకు చుట్టుకోగా.. ఇక ఇప్పుడు బీజేపీ కూడా హ్యాండిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని వైసీపీ అధిష్టానం ఆందోళన చెందుతోందని టాక్. మొత్తానికి పవన్, చంద్రబాబు భేటీ రాజకీయ వర్గాల్లో పెను సంచలనానికి దారి తీసింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago