Movie News

Allu Sirish: క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి అండగా అల్లు శిరీష్… ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్!

Allu Sirish: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముగ్గురు వారసులు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. పెద్ద కుమారుడు బాబి నిర్మాణం రంగంలో బిజీగా ఉండగా రెండవ కుమారుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక చిన్న కుమారుడు అల్లు శిరీష్ కూడా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన సత్తా నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు అల్లు శిరీష్ నటించిన సినిమాలు ఒక మోస్తారు హిట్ అందుకున్నాయి.

గతేడాది ఊర్వశివో రాక్షసివో సినిమా ద్వారా హిట్ అందుకున్న అల్లు శిరీష్ ప్రస్తుతం ఒక మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా అల్లు శిరీష్ మీద అభిమానులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే..ఇటీవల బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారికి సహాయం చేయడానికి అల్లు శిరీష్ ముందుకొచ్చాడు. బాధిత చిన్నారిని, అతని కుటుంబాన్ని తన ఆఫీసుకు ఆహ్వానించి..వారి బాగోగులు చూసుకోవడమే కాకుండా చిన్నారి చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం చేశాడు.

అంతేకాకుండా ఆ చిన్నారి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అల్లు శిరీష్ చేసిన సహాయం గురించి తెలుసుకున్న అభిమానులు అతని మంచి మనసు గురించి తెలుసుకొని అతని మీద ప్రశంసలకు కురిపిస్తున్నారు.
మరొకవైపు చిన్నారి ప్రాణాలు కాపాడినందుకు ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా శిరీష్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. స్క్రీన్ మీద మాత్రమే కాకుండా అల్లు శిరీష్ నిజ జీవితంలో కూడా రియల్ హీరో అని నిరూపించుకున్నాడు.

Allu Sirish: స్క్రిప్ట్ వినే పనిలో బిజీ…

ఇదిలా ఉండగా అల్లు శిరీష్ సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఏడు సినిమాలలో నటించిన అల్లు శిరీష్ గత ఏడాది ఊర్వశివో రాక్షసువో సినిమా ద్వారా హిట్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా విడుదలై ఇప్పటికే ఆరు నెలలు గడిచినప్పటికీ తన తదుపరి సినిమా గురించి అల్లు శిరీష్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అంటే కొంచెం ఆలస్యమైనా సరే మంచి స్క్రిప్ట్ కోసం అల్లు శిరీష్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago