Political News

TDP leader Vangalapudi Anitha : ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందంటే..: టీడీపీ నేత వంగలపూడి అనిత

TDP leader Vangalapudi Anitha: టీడీపీ మహిళా నేతగా 2014లో తొలిసారి ఎమ్మెల్యే గా పాయకరావుపేట నియోజకవర్గం నుండి గెలిచిన వంగలపూడి అనిత తొలుత టీటీడీ సభ్యురాలిగా పనిచేసారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ మహిళా నేత తానేటి వనిత చేతుల్లో ఓడిపోయిన అనిత ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మీడియా సమావేశాల్లోను డిబేట్స్ లో పాల్గొంటూ వైసీపీ మీద విరుచుకుపడే అనిత ఫైర్ బ్రాండు గా పేరు తెచ్చుకున్నారు. ఎపుడూ రాజకీయాలు విమర్శలు, ప్రతి విమర్శలు అంటూ బిజీగా ఉండే అనితగారు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడారు.

టచ్ లో ఆ నలభై మంది ఎమ్మెల్యేలు…

అనిత గారు ఇటీవల ఏపీ వైసీపీ పార్టీ గురించి మాట్లాడుతూ జగన్ తీరు నచ్చక ఆ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ మీద తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా టిడిపి పార్టీకి టచ్ లో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారని అయితే వాళ్ళ పేర్లు చెబితే అనవసరంగా వాళ్ళు ఇబ్బందులు పదుతారని అందుకే చెప్పడం లేదంటూ చెప్పారు. సీఎంని కలవడానికి ఏపీ లో వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మందికి అసలు అపాయింట్మెంట్ దొరకలేదని, ఇప్పటివరకు సీఎం మొహం ఎరగని వారు చాలా మంది ఉన్నారని కేవలం సలహా దారులు మాత్రమే కలుస్తారని తెలిపారు అనిత.

మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ అని ఆరోపణలతో సస్పెండ్ చేసిన శ్రీదేవి పరిస్థితి దారుణంగా ఉందని, ఆమెను ఆమె కూతుర్లను సోషల్ మీడియా ద్వారా బాగా ట్రోల్ చేస్తున్నారు. ఒక మహిళ అని కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఆమె ప్రెస్స్ మీట్ పెట్టి జగన్ అలాగే సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని విమర్శించినప్పటి నుండి ఆమె పదికోట్లు తీసుకుంది 15 కోట్లు తీసుకుంది అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago