Dasara Movie: నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా తాజాగా నటించిన చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30వ తేదీ విడుదల అయ్యి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇలా ఈ సినిమా మొదటి షో నుంచి మంచి ఆదరణ పొందడంతో భారీ కలెక్షన్లను కూడా రాబడుతుంది.
ఇక ఈ సినిమా చూసినటువంటి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ప్రభాస్ వంటి హీరోలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి సైతం దసరా సినిమా గురించి స్పందిస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి గురించి చెబుతూ జక్కన్న ప్రశంసలు కురిపించారు.
రగ్గ్‌డ్ రా కారెక్టర్ల మధ్య ఇలాంటి సున్నితమైన ప్రేమను చూపించిన శ్రీకాంత్ ఓదెలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. నాని కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.. ఇక కీర్తి సురేష్ గురించి చెప్పాల్సిన పని లేదు.. ఎంతో అవలీలగా చేసేసింది.. ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకునేలా నటించారు.. ఇంతటి విజయాన్ని అందుకున్న దసరా టీంకు శుభాకాంక్షలు చెప్పాల్సిందే అంటూ రాజమౌళి సినిమా పై ప్రశంసలు కురిపించారు.
ఇలా రాజమౌళి సినిమా గురించి ప్రశంసల కురిపించడంతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎలాంటి రిప్లై ఇవ్వాలో అర్థం కాక ఏకంగా లవ్ సింబల్ షేర్ చేస్తూ దండం పెట్టేసారు. ఇక హీరో నాని రాజమౌళి ట్వీట్ కి రిప్లై ఇస్తూ సర్ ఇదే మాకు ఆస్కార్ అవార్డు వచ్చినట్టు అంటూ రాజమౌళి చేసిన ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…