Teja: తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలన్నింటిలోనూ హీరోయిన్స్ పక్క రాష్ట్రాల వాళ్లే ఉంటారు. తెలుగులో కూడా ఎంతోమంది అమ్మాయిలు అందంగా ఉండడమే కాకుండా మంచి టాలెంట్ కలిగిన వారు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి వారందరూ కూడా హీరోయిన్లుగా కాకుండా సినిమాలో ఏదో ఒక చిన్న పాత్రలలో నటిస్తూ ఉంటారు.అయితే హీరోయిన్ గా మాత్రం పక్క రాష్ట్రాల వారి కోసమే దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ విధంగా తెలుగు సినిమాలలో పక్క రాష్ట్రాల హీరోయిన్స్ హడావిడి కనపడుతుంది. అయితే ఎన్నోసార్లు తెలుగు వారికి నటించడం రాదా తెలుగు అమ్మాయిలు అందంగా లేరా వీరిని కాకుండా పక్క రాష్ట్రాల వారిని ఎందుకు తీసుకుంటున్నారు అన్న సందేహాలు కూడా అందరికీ వ్యక్తం అవుతూ ఉన్నాయి. అయితే ఇదే ప్రశ్న తాజాగా డైరెక్టర్ తేజ గారికి ఎదురైంది.
ఈయన అహింస సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే తేజ గారికి ఇదే ప్రశ్న ఎదురు కావడంతో ఆయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. తెలుగు అమ్మాయిలను హీరోయిన్ల గా తీసుకోవడం కోసం తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు. దాదాపు మూడు నాలుగు సార్లు తెలుగు అమ్మాయిలకు హీరోయిన్గా అవకాశాలు ఇచ్చి వారి చేత ఫోటోషూట్లు చేయించి, లుక్ టెస్ట్ కూడా చేయించానని తేజ తెలిపారు.
ఇలా అన్ని పనులు పూర్తయిన తర్వాత ఒక ఆరు నెలల వరకు వేచి చూడండి అని చెబితే వారికి కేవలం ఓపిక లేక సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించడానికి వెళ్తున్నారని తేజ తెలిపారు.ముందుగా తెలుగు అమ్మాయిలకు ఓపిక లేకపోవడమే వారిని సినిమాలలోకి తీసుకోకపోవడానికి కారణం అంటూ ఈ సందర్భంగా తేజ తెలియజేశారు.ఇలాంటి పరిస్థితులు నాకు రెండు మూడు సార్లు ఎదురయ్యాయి అందుకే దర్శక నిర్మాతలు అందరూ కూడా తెలుగు అమ్మాయిలకు చిన్న చిన్న పాత్రలు ఇచ్చి హీరోయిన్లుగా వేరే రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువస్తున్నారంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…