Categories: FeaturedMovie News

Tejaswi Madivada : కౌశల్ ఆర్మీ పెట్టిన టార్చర్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా.. రోజూ మందు తాగి ఒంటరిగా తిరిగేదాన్ని.. ఇప్పుడు ఏమయ్యాడు వాడు ? : తేజస్వి మదివాడ

Tejaswi Madivada : ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో సైడ్ క్యారెక్టర్ తో పాపులర్ అయిన తేజస్వి ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ సినిమా ‘ఐస్ క్రీమ్’ లో మెయిన్ లీడ్ చేసి బాగా గుర్తింపు తెచ్చుకుంది. చాలా బోల్డ్ గా సినిమాలు చేస్తూ మాట్లాడే తేజస్వి బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొనింది. చేసింది తక్కువ సినిమాలే అయినా అమ్మడి బోల్డ్ నెస్ తో బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం ‘కమిట్మెంట్’ అనే సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే సినిమా విడుదలకు ముందే హాట్ కామెంట్స్ చేసి సినిమాకు మంచి పబ్లిసిటీ ఇచ్చింది.

కౌశల్ ఆర్మీ వల్ల చాలా బాధ పడ్డాను…

కేరింత, ఐస్ క్రీమ్ వంటి సినిమాలతో బాగా క్రేజ్ తెచ్చుకున్న తేజస్వి, బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయింది. అయితే బిగ్ బాస్ లో కౌశల్ ఆర్మీ వల్ల బాగా నెగెటివిటీ ఎదుర్కొన్నానని తాజాగా కమిట్మెంట్ సినిమా ప్రమోషన్స్ లో ఓపెన్ అయింది. బిగ్ బాస్ లో నుండి బయటికి వచ్చినపుడు హ్యాపీగా బయటికి వచ్చాను కానీ సోషల్ మీడియాలో నాపై కౌశల్ ఆర్మీ బూతులు తిట్టడం, పిచ్చి పిచ్చి మీమ్స్ తో రెచ్చిపోయారు. ఇవన్నీ భరించలేక పోయాను. ఇండియాలో ఉండకుండా విదేశాల్లో ఒంటరిగా ఉన్నాను, సినిమాలను వదిలేసాను. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను.

జీవితంలో సినిమాల జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను, ఫుల్లుగా మద్యం తాగి, లావేక్కిపోయాను. అదే సమయంలో కమిట్మెంట్ సినిమా ఆఫర్ వచ్చింది. కథ నచ్చింది మళ్ళీ సినిమా చేయాలనిపించింది. అయితే సినిమాల వల్ల కంటే బిగ్ బాస్ కౌశల్ ఆర్మీ వల్ల చాలా బాధ పడ్డాను అంటూ చెప్పింది. అయినా ఇదంతా చేసి కౌశల్ ఏమి సాధించాడు. ఇప్పుడు ఇండస్ట్రీ లో ఎక్కడున్నాడు.. ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం వచ్చింది అతనికి అంటూ ఫైర్ అయింది. ఇక కమిట్మెంట్ సినిమాలో నేను లావుగా షేప్ అవుట్ అయి కనిపిస్తాను కారణం అప్పుడు ఫుల్లుగా మందు తాగుతూ ఉండేదాన్ని అందుకే అలా అంటూ ఓపెన్ గా అన్నీ చెప్పేసింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago