Categories: FeaturedMovie News

Big boss : మరోసారి బిగ్ బాస్ లోకి రియల్ జంట… వరుణ్, వితిక తరువాత వీళ్ళే…!

Big Boss : బిగ్ బాస్ సందడి మొదలయిపోయింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలవబోతోంది. కొత్త ప్రోమోతోనే షో మీద ఇంట్రస్ట్ పెంచేసాడు కింగ్ నాగార్జున. ఇక బిగ్ బాస్ లవర్స్ ఫుల్ బిజీ కానున్నారు. ఇక అపుడే షోలో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా రాబోతున్నారని నెట్టింట్లో వెతుకులాట మొదలుపెట్టేసారు. ప్రోమోలతో బాగా హీట్ పెంచేసిన నాగార్జున ఇక ఆట మొదలుపెట్టబోతున్నారు. సెప్టెంబర్ 4 నుండి మొదలవబోతున్న ఈ షో కోసం ఆల్రెడీ కంటెస్టెంట్స్ సెలక్షన్ జరిగిపోయింది. ఇక వారిని క్వారంటీన్ చేసే పనిలో బిగ్ బాస్ యాజమాన్యం ఉంది. అయితే లీకులతో బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైంది.

రియల్ కపుల్ గా ఈసారి బుల్లితెర జంట…

బిగ్ బాస్ షోలో హౌస్ లోకి ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్స్ ను పంపుతారు. కానీ తొలిసారి తెలుగు బిగ్ బాస్ లో రియల్ గా పెళ్ళైన జంటను పంపారు. సినిమా హీరో, హీరోయిన్లైనా వరుణ్ సందేశ్, వితికలను బిగ్ బాస్ లోకి పంపారు. మళ్ళీ ఆ ప్రయోగం వేరే సీజన్స్ లో చేయలేదు. కానీ మరో సారి నిజమైన జంటను హౌస్ లోకి పంపబోతున్నారు బిగ్ బాస్. అయితే ఈసారి వెండితెర కపుల్ కాదు బుల్లితెర కపుల్ కనువిందు చేయనున్నారు.

అమెరికా అమ్మాయి, సిరి సిరి మువ్వ, ఉయ్యాలా జంపాల వంటి సీరియల్స్ తో పాపులర్ అయిన మెరినా అబ్రహం, ఆమె భర్త సీరియల్ ఆర్టిస్ట్ రోహిత్ సాహ్ని లను హౌస్ లోకి పంపుతున్నారు అని సమాచారం. రోహిత్ సాహ్ని నీలి కలువలు, అభిలాష వంటి సీరియల్స్ లో నటించారు. నిజానికి మెరినా, రోహిత్ ఒక సినిమాలో కలిసి నటించారు. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు కానీ వీళ్లిద్దరూ స్నేహితులు అయ్యారు. ఇక యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా వీళ్ళు మంచి ఫాలోయింగ్ తో ఉన్నారు. ఇక బిగ్ బాస్ లో ఈ జంట ఎలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారో చూడాలి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago