Big Boss : బిగ్ బాస్ సందడి మొదలయిపోయింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలవబోతోంది. కొత్త ప్రోమోతోనే షో మీద ఇంట్రస్ట్ పెంచేసాడు కింగ్ నాగార్జున. ఇక బిగ్ బాస్ లవర్స్ ఫుల్ బిజీ కానున్నారు. ఇక అపుడే షోలో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా రాబోతున్నారని నెట్టింట్లో వెతుకులాట మొదలుపెట్టేసారు. ప్రోమోలతో బాగా హీట్ పెంచేసిన నాగార్జున ఇక ఆట మొదలుపెట్టబోతున్నారు. సెప్టెంబర్ 4 నుండి మొదలవబోతున్న ఈ షో కోసం ఆల్రెడీ కంటెస్టెంట్స్ సెలక్షన్ జరిగిపోయింది. ఇక వారిని క్వారంటీన్ చేసే పనిలో బిగ్ బాస్ యాజమాన్యం ఉంది. అయితే లీకులతో బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైంది.

రియల్ కపుల్ గా ఈసారి బుల్లితెర జంట…
బిగ్ బాస్ షోలో హౌస్ లోకి ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్స్ ను పంపుతారు. కానీ తొలిసారి తెలుగు బిగ్ బాస్ లో రియల్ గా పెళ్ళైన జంటను పంపారు. సినిమా హీరో, హీరోయిన్లైనా వరుణ్ సందేశ్, వితికలను బిగ్ బాస్ లోకి పంపారు. మళ్ళీ ఆ ప్రయోగం వేరే సీజన్స్ లో చేయలేదు. కానీ మరో సారి నిజమైన జంటను హౌస్ లోకి పంపబోతున్నారు బిగ్ బాస్. అయితే ఈసారి వెండితెర కపుల్ కాదు బుల్లితెర కపుల్ కనువిందు చేయనున్నారు.

అమెరికా అమ్మాయి, సిరి సిరి మువ్వ, ఉయ్యాలా జంపాల వంటి సీరియల్స్ తో పాపులర్ అయిన మెరినా అబ్రహం, ఆమె భర్త సీరియల్ ఆర్టిస్ట్ రోహిత్ సాహ్ని లను హౌస్ లోకి పంపుతున్నారు అని సమాచారం. రోహిత్ సాహ్ని నీలి కలువలు, అభిలాష వంటి సీరియల్స్ లో నటించారు. నిజానికి మెరినా, రోహిత్ ఒక సినిమాలో కలిసి నటించారు. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు కానీ వీళ్లిద్దరూ స్నేహితులు అయ్యారు. ఇక యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా వీళ్ళు మంచి ఫాలోయింగ్ తో ఉన్నారు. ఇక బిగ్ బాస్ లో ఈ జంట ఎలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారో చూడాలి.































