Movie News

Varahi: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కనిపించని వారాహి… తెలంగాణ ఎన్నికలను పవన్ లైట్ తీసుకున్నారా?

Varahi: జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వారాహి అనే వాహనాన్ని తయారు చేయించుకున్నారు. ఎన్నో రకాల సౌకర్యాలతో ఈ వాహనం తయారు చేశారు దీనిని తయారు చేయడం కోసం భారీ స్థాయిలోనే ఖర్చు కూడా జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ వాహనం కూడా తెలంగాణలోనే రిజిస్ట్రేషన్ అయింది.

వారహి వాహనంలో ఆంధ్రప్రదేశ్లో పలు నియోజకవర్గాలలో రోడ్ షోలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మాత్రం ప్రచారానికి ఈ వారాహి వాహనాన్ని ఉపయోగించలేదు దీంతో తెలంగాణ జనసేన శ్రేణులు ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని ఎన్నికల ప్రచారంలోకి తీసుకురాలేదు అన్న అనుమానాలు అందరిలోనూ కలిగాయి.

ఇలా పవన్ కళ్యాణ్ వారాహి ద్వారా ప్రచార కార్యక్రమాలను నిర్వహించకపోవడంతో ఈ ఎన్నికలను పవన్ కళ్యాణ్ లైట్ తీసుకున్నారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి ఏదో ప్రచారం చేయాలి అంటే చేయాలి అన్న ఉద్దేశంతో మమ అనిపించారని జనసేన బాధ్యతలను కూడా బిజెపి పార్టీని తీసుకుందని స్పష్టంగా అర్థం అవుతుంది.

జనసేన బాధ్యతలను తీసుకున్న బిజెపి…

పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజెపితో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల బరిలోకి వచ్చారు. అదే ఆంధ్రప్రదేశ్లో ఈయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీపై విమర్శలు చేస్తున్న విధంగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పై ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు. ఏదో ఎన్నికల ప్రచారంలోకి రావాలి అంటే రావాలన్న ఉద్దేశంతోనే అలా కనిపించి వెళ్ళారు కానీ పెద్దగా ఈయనకు తెలంగాణ ఎన్నికలపై ఆసక్తి లేదని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago