Featured

Telangana Congress : రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టేందుకు భారీ స్కెచ్చే వేసింది.. కానీ వర్కవుట్ అవుతుందా?

Telangana Congress : తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మంచి క్రేజే ఉంది. కానీ ఆ పార్టీ మాత్రం ఆ అంశాన్ని ఎంతమేర వినియోగించుకుంటోదనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇక టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అని అనుకోగమా? రేవంత్ రెడ్డి పాదయాత్రతో జనాల్లో మంచి కదలికనైతే తీసుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కావల్సినంత జోష్ నింపుతున్నారు.

రేవంత్ పాదయాత్రకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇదంతా ఓటు బ్యాంకుగా మారితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు. లేదంటే అదంతా రేవంత్‌పై ఉన్న క్రేజ్ మాత్రమే అయితే పార్టీకి మళ్లీ దెబ్బే. ఇక రాష్ట్రంలో ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? నానాటికీ తీసికట్టేనా? లేదంటే ఏమైనా పుంజుకుందా? ఎప్పటికప్పుడు దమ్కీ ఇస్తున్న సీనియర్ నేతలు దారికి వచ్చినట్టేనా? లేదంటే అలాగే కంటిన్యూ అవుతున్నారా? రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో తెలుసుకుందాం.

కొడంగల్ నుంచి రేవంత్ పోటీ..!

తెలంగాణలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టకుండా నిలువరించడం కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ శతవిధాలా యత్నిస్తున్నాయి. బీజేపీ సంగతి అటుంచితే కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఉందా? అనేది మిలియన్ డాలర్స్ క్వశ్చన్. ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో.. ఏం కామెంట్ చేస్తారో తెలియని పరిస్థితి. పార్టీకి అండగా నిలవాల్సిన సీనియర్లే ఈ పార్టీకి మైనస్. వారంతా చేసేదేమీ లేకపోగా.. చేసే వారికి కూడా అవరోధాలు కల్పిస్తున్నారని జనంలో చర్చ నడుస్తోంది. ఇక ఈ తరుణంలో రేవంత్ పాదయాత్ర చేపట్టారు. ఆయనకు వస్తున్న ఆదరణ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయనే అనిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో తలపడేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్ద స్కెచ్చే వేసిందని టాక్ అయితే నడుస్తోంది. ఇప్పటికే తాను కొడంగల్ నుంచి పోటీ చేస్తానని రేవంత్ ప్రకటించారు. మరి మల్కాజ్‌గిరి పరిస్థితేంటనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే గత ఎన్నికల్లో కొడంగల్‌లో ఆయన ఓటమి పాలయ్యారు. ఈ సారి తిరిగే తానే పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి మరో స్థానాన్ని అప్పగించాలనేది టార్గెట్ అని తెలుస్తోంది.

సీనియర్స్ అంతా అసెంబ్లీకే..

ఆసక్తికరంగా ఈసారి రేవంత్ సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్స్ అంతా అసెంబ్లీకి పోటీ చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. ముందుగా ఎమ్మెల్సీ సీట్లను పెంచుకోవడమే వ్యూహమట. ఆ తరువాత ఎంపీ స్థానాల గురించి ఆలోచిస్తారట. ఇప్పటికే అధిష్టానం.. కాంగ్రెస్ గెలిచే స్థానాలేంటి? టఫ్ ఫైట్ నడిచే నియోజకవర్గాలేవి? అతి తక్కువ మెజారిటీతో కాంగ్రెస్ కోల్పోయిన స్థానాలేంటనే విషయాలను ముందుగా ఆరా తీస్తోందని టాక్. దీనిపై అధిష్టానం సర్వేలు కూడా చేయిందనే చర్చ నడుస్తోంది. ఈ సర్వే ఆధారంగానే ముందుకు వెళుతుందని టాక్. అయితే మల్కాజ్‌గిరి స్థానానికి రేవంత్ పోటీ చేయడం లేదని ప్రకటించడంతో మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఫుల్ హ్యాపీగా ఉన్నారట. ఇక రేవంత్ పాదయాత్రలో భాగంగా చాలా గ్రామాల్లో వేరొక పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరుతుండటం కలిసొస్తున్న అంశం.

ఖమ్మం జిల్లా మాదిరిగానే ఇతర జిల్లాలుంటే..

ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి మారతారనే టాక్ ఉంది. స్వయంగా రాహుల్ గాంధీయే రంగంలోకి దిగి ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని టాక్. ఒకవేళ పొంగులేటి మాత్రం కాంగ్రెస్‌లో చేరారంటే.. ఇక ఖమ్మం జిల్లా దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్‌గా మారినట్టే. పొంగులేటికి జిల్లాపై మంచి పట్టుంది. ఇతర పార్టీల నేతలతో పోలిస్తే ఆయన డబ్బులకు వెనుకాడరు. తన క్యాండిడేట్ రంగంలోకి దిగితే మాత్రం అంతా తానై నడిపిస్తారనే టాక్ ఉంది. అందునా కాంగ్రెస్ పార్టీకి ఒకానొక సమయంలో ఖమ్మం జిల్లా కంచుకోట. తిరిగి ఆ ఊపును తీసుకొస్తే.. జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీవైపు టర్న్ అవుతుంది. ఇక ఈ జిల్లాల మాదిరిగానే మిగతా జిల్లాల నుంచి కూడా కీలక వ్యక్తులపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తే మాత్రం అధికారం దక్కించుకునే అవకాశం ఉంది. పైగా తెలంగాణను ఇచ్చిన పార్టీగా.. కాంగ్రెస్‌పై జనాల్లో అభిమానం ఉంది. నేతల కొట్లాటల వల్లే ఇబ్బంది. ఇప్పటికైనా సీనియర్స్ అంతా కలిసి వస్తే మాత్రం అధికారం ఆ పార్టీదేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

48 minutes ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

52 minutes ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

57 minutes ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

1 hour ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

1 hour ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

1 hour ago