కొన్ని సందర్భాల్లో ప్రధాన పదవుల్లో ఉన్న నేతలు తీసుకున్న నిర్ణయాలు లాభం కంటే నష్టం ఎక్కువగా చేస్తాయి. తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న ఒక నిర్ణయం కూడా మన రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాలకే ప్రయోజనం చేకూరుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ నిర్ణయంతో ఇతర రాష్ట్రాలకు కాసుల వర్షం కురుస్తోంది. ఇలా జరగడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెట్రోల్ రేట్లలో ఉన్న వ్యత్యాసాలే కారణం.
పూర్తి వివరాల్లోకి వెళితే కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఏపీ ప్రభుత్వానికి గతంతో పోలిస్తే ఆదాయం భారీగా తగ్గుతోంది. ఆదాయం తగ్గుతున్నా ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తుండటంతో రాష్ట్రానికి ఆర్థికపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తోంది. అందులో భాగంగా గత నెలలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ లీటర్ కు రూపాయి చొప్పున సెస్ పెంచింది.
ప్రభుత్వం పన్నులు పెంచడంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంతో పోల్చి చూస్తే లీటర్ పెట్రోల్ మూడు రూపాయలు, లీటర్ డీజిల్ 2.70 రూపాయలు ఎక్కువగా ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లోని వాహనదారులు సమీపంలోని తెలంగాణ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే వాహనదారులు ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్నారు.
కొన్ని పెట్రోల్ బంకుల్లో ఏకంగా ఏపీకి, తెలంగాణకు మధ్య ధరల్లో వ్యత్యాసం ఉందని ఫ్లెక్షీలు ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఏపీతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువగానే ఉండటం గమనార్హం. ఏపీ ప్రభుత్వం నిర్ణయం వల్ల ప్రభుత్వం కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…