Categories: FeaturedMovie News

బుల్లితెర షోలన్నీ బూతు షోలుగా మారిపోతున్నాయనడానికి నిదర్శనంగా మారిన సుమ షో !!

తెలుగు బుల్లితెరపై కాస్త మంచి గుర్తింపు ఉన్న యాంకర్ సుమ కనకాల. ఈమె ఏ షో చేసినా కూడా ఆ షో ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయం. రేటింగ్స్ విషయంలో కూడా సుమ చేసిన షోలు అద్భుతాలు చేస్తుంటాయి. అందుకే ఆమె ఏ షో చేసినా ఆ షోను ఇంటిల్లిపాది కూర్చుని చక్కగా చూడొచ్చనే ఇమేజ్ కూడా ఉంది. అయితే లేటెస్ట్ గా సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ షోను చూస్తుంటే ఈమె కూడా రానురాను అందరిలాగే మారిపోతుండెమో అనిపిస్తుంది.

సుమ పద్దతిగా ఉంటే సరిపోదు.. షోలో కూడా పద్దతులు పాటించాలి కదా అంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. వివరాల్లోకి వెళ్తే.. తాజాగా సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ షోలో రొమాన్స్ శృతిమించింది. ఆ షోకి హాజరైన జంటలు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. దీంతో సుమ చీర అడ్డుపెట్టుకుని మరీ సిగ్గు పడిపోయింది. క్యాష్ దొరికినంత దోచుకో..’ అంటున్న సుమా.. ఈసారి రొమాంటిక్ జంటలకు ఆహ్వానం పలికింది. దాంతో షో మొత్తం ముద్దుల వర్షంతో మునిగిపోయింది. ఓంకార్ హోస్ట్‌ చేసిన ‘ఇస్మార్ట్ జోడీ’తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన రియల్ కపుల్స్ అయిన సెలబ్రెటీ జోడీస్ అశ్మిత-సుధీర్, ఇంద్రనీల్-మేఘనా, మెరీనా-రోహిత్, యశ్వంత్ మాస్టార్-వర్షలు జంటలుగా వచ్చి క్యాష్ షోలో కనువిందు చేశారు. మొదట అశ్మిత-సుధీర్‌లు ‘చారుశీల స్వప్నబాల..’ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపే స్టెప్స్‌తో అదరగొట్టారు. యాంకర్ సుమా.. ‘మొడుగు పెళ్లాలగే వాళ్లు స్వీటు హాటులాగా కలిపి ఉండాలి..’ అంటూ స్వీట్ ఇవ్వడంతో ఒకరికి ఒకరు తినిపించుకుంటూ రొమాంటిక్‌ లుక్స్ ‌తో కిరాక్ పుట్టించారు అశ్మిత-సుధీర్‌ల జంట.

అది చూసిన సుమా.. ‘వీళ్లిద్దరినీ వదిలేస్తే ఇక్కడే పల్లీబఠానీలు తింటూ ఉండిపోయేలా ఉన్నారు..’ అంటూ పంచ్ పేల్చింది. తర్వాత ‘చిరు గాలి చూద్దు..’సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఇంద్రనీల్, మేఘనాలు డాన్స్ చేస్తూనే. ‘ మా పాట మారిపోయింది మేము చెయ్యం’ అంది మేఘనా. దాంతో సుమా.. ‘పాటమారినా మీరు మారలేదుగా.. మీ మధ్యలో కుచుకుచు (చేతులతో ముద్దులు పెట్టినట్లు చూపిస్తూ) మారకూడదుగా..’ అంటుండగానే మేఘనా ఇంద్రనీల్ ‌ని అల్లేసుకోవడంతో.. ‘చూడండి అదిగో..’ అంటుంది సుమా నోరు వెళ్లబెట్టి. దాంతో మేఘనా ఇంద్రనీల్‌ని హగ్ చేసుకుని ‘మేము ఫిక్స్ అయ్యాం అబ్బా..’ అంటూ రొమాంటిక్ స్టెప్స్ వేసింది. దాంతో సుమా.. ‘పోనీలే ఈ పాట వల్ల ఇద్దరికీ లాభాలే జరిగాయి’ అంటూ డబుల్ మీనింగ్ పంచ్ వెయ్యడంతో కామెడీ ఫీక్స్‌కి వెళ్లింది. ‘బాబు.. నువ్వు చెప్పు..’ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన మెరీనా, రోహిత్.. స్వీట్ తినిపించుకుంటూనే.. మెరీనా రోహిత్‌కి ముద్దు పెట్టడంతో… ‘మేము ఇచ్చింది 2 స్వీట్ బౌల్సే.. ఆవిడి మూడోది (ముద్దు) కూడా ఇచ్చింది’ అని సుమా అనడంతో.. మెరీనా జంటతో పాటు మిగిలిన జంటలు బాగా నవ్వారు.

‘వాటే వాటే వాటే బ్యూటీ’ సాంగ్‌ తో ఎంట్రీ ఇచ్చిన.. యశ్వంత్ మాస్టార్-వర్షలు.. స్వీట్ తినిపించుకుంటూ ఉండగా సుమా చూస్తూ… ‘ఎంత పెట్టినా, ఎంత తిన్నా.. పెద్దగా కనపడదు కదా..?’ అని వర్షని అడగడంతో.. ‘హా.. చాలా తింటాడు ముక్కలు, ఎముకలు అన్నీ చాలా తింటాడు..అయినా కనిపించడు’ అని చెప్పడంతో.. ‘ఎముకలు కూడానా..’ అని సుమా నోరెళ్లబెట్టడంతో.. షోలో నవ్వులు విరబూసాయి. వర్ష కూడా యశ్వంత్ బుగ్గన ముద్దుపెట్టడంతో… సుమా తన చీర కొంగు ముఖాన్న వేసుకుని, సిగ్గుపడుతూ.. ‘అట్టకాదు.. ఇవాళ్ల అన్నీ చూడాల్సివస్తోంది.. అప్పుడెప్పుడో ఏడేళ్ల క్రితం క్యాష్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇవన్నీ లేవు..’ అనడంతో ఫుల్ కామెడీ సందడి చేసింది. తర్వాత ఈ రొమాంటిక్ కపుల్స్‌ కి మరో రొమాంటిక్ గేమ్ పెట్టింది యాంకర్ సుమా. ప్రశ్నలడిగి.. జవాబు చెప్పాక్కర్లేదు మెడలో దండ వెయ్యాలి.. అంటూ.. జంటలని ఎదురెదురుగా నిలబెట్టి.. పూల దండలతో ఆట ఆడించింది. అయితే 4 జంటలు వారి వారి పార్టనర్‌తో ఒకే దండను ధరించి.. రొమాంటిక్ స్టెప్స్‌ తో ఇరగదీశారు. మరి వీళ్లల్లో ఏ జంట గెలిచారో? ఏ జంట ఎంత క్యాష్ దోచుకున్నారో..? తెలియాలంటే రాబోయే ఎపిసోడ్ (సెప్టెంబర్ 19) కోసం వెయిట్ చెయ్యాల్సిందే. మొత్తానికి బుల్లితెర షోలన్నీ బూతు షోలుగా మారిపోతున్నాయన్నమాట..!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago