Featured

సినిమాలను వదిలేసి టాప్ కంపెనీలలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగు హీరోయిన్స్ !!

సినిమా..ఏ భాషలో అయినా ఇదొక రంగుల ప్రపంచమే. ఒక్కసారి ఈ ప్రపంచం లోకి అడుగుపెట్టాక బయటకు వచ్చే దారి ఉండదు. సెలబ్రిటీ లైఫ్ స్టైల్ చుసిన వారు ఎవ్వరైనా అలాంటి జీవితమే ఎల్లప్పుడూ కోరుకుంటారు. ముక్యంగా హీరోయిన్స్ అయితే ఆ కలల ప్రపంచం లేకుండా జీవించలేరు. కానీ హీరోయిన్స్ లైఫ్ మహా అయితే ఒక పదేళ్లు ఇండస్ట్రీ లో ..అంత కన్నా అంటే అక్క వదిన అమ్మ పాత్రలు చేయాలి. పెళ్లయిందా ఇంకా నటనకు ఫుల్ స్టాప్ పెట్టి సంసారం జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. కొంత మంది హీరోయిన్స్ మాత్రం భర్తలతో బిజినెస్ లు లేదంటే వారికి నచ్చిన ఏదైనా ప్రొఫషన్ కి మారిపోతారు.

మనం ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్స్ మాత్రం అలా కాదు. నటనలో స్టార్ డం చూసి ఆ తర్వాత పెళ్ళై పిల్లలు ఉన్న కూడా భర్త పైన లేదంటే కుటుంబం పైన ఆధారపడకుండా తమకంటూ మరొక కొత్త ఐడెంటిటీ ని సృష్టించుకొని ప్రపంచమే తమను మెచ్చుకునేలా దీటుగా మరొక రంగంలో రాణిస్తున్నారు. టాలీవుడ్ నుండి అలా దూరం అయ్యి వరల్డ్ బెస్ట్ కంపెనీ లలో కీలక బాధ్యతలు తమ భుజాన వేస్తూ తాము సినిమాల్లో నటించే బొమ్మలము మాత్రమే కాదు చదువు ఇచ్చిన జ్ఞానం తో ప్రపంచాన్నే జయించగలం అని నిరూపిస్తున్నారు. ఆలా సినిమా రంగం వదిలేసి కెలక ఉద్యోగాలు చేస్తున్న హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం.

మొదటగా మాన్య. నాగార్జున హరికృష చెల్లిగా సీతారామరాజు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది మాన్య. మాయదారి మైసమ్మ పాటతో మంచి ఫాన్స్ ని కూడా సంపాదించుకుంది ఈ రెండు సినిమాల హిట్ తర్వాత తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో మొత్తంగా 41 సినిమాల్లో నటించింది. పెళ్లి చేసుకొని ప్రస్తుతం న్యూ యార్క్ లో ఉంటున్న మాన్య నాలుగేళ్ళ కూతురికి అమ్మ కూడా. కానీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినా బ్యాంకింగ్ సంస్థ అయినా jp morgan chase కంపెనీ లో కీలక బాధ్యతల్లో ఉంది. నటన నుండి నేరుగా ఫైనాన్స్ రంగం లో స్థిరపడిందిమాన్య. ప్రస్తుతం మాన్య ఎందరికో ఆదర్శం.

ఇక ఇదే దోవలో ప్రయాణిస్తున్న మరో నటి మయూరి కాంగో..మహేష్ బాబు వంశి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన మయూరి బాలీవుడ్లో చాల చిత్రాల్లో నటించింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్న ఈ బ్యూటీ సినిమాలపై మక్కువతో చదువును వదిలేసింది. ఆ తర్వాత అజయ్ దేవగన్, అనుపమ్ ఖేర్, అర్షద్ వార్సీ, శక్తికపూర్, బాబీ డియోల్, రాణి ముఖర్జి, చంద్రచూడ్ సింగ్, జుగల్ హన్స్‌రాజ్‌తో కలిసి నటించారు.. వెండితెరపైన సరైన అవకాశాలు రాకపోవడంతో కొన్నాళ్లు బుల్లితెరపైన అదృష్టాన్ని పరీక్షించుకొన్నది. అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా సినిమాలను వదిలేసిన మయూరి కాంగో న్యూయార్క్‌లోని జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ ఫైనాన్స్ విద్యను అభ్యసించారు. ప్రస్తుతం గుర్‌గావ్‌లో నివసిస్తున్న మయూరి కాంగో గూగుల్ ఇండియాలో టాప్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను చేపట్టింది.

మరొక హీరోయిన్ అపర్ణ. వెంకటేష్ నటించిన సుందరకాండ చిత్రం గుర్తుందిగా… అందులో వెంకటేష్‌ను ఆటపట్టించే ఒక టీనేజ్ అమ్మాయి పాత్రలో నటించిన నటి పేరే అపర్ణ. ఆ సినిమా తరువాత ఆమె మరలా ఏ ఇతర చిత్రంలోనూ నటించలేదు. 2002లో శ్రీకాంత్ అనే ఎన్నారైని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. అప్పటికే ఇండియాలో చైల్డ్ సైకాలజీలో విద్యను అభ్యసించిన పెళ్లయ్యాక అమెరికాలో డబల్ మాస్టర్స్ చేసి అక్కడ ఒక టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో సైకాలజీ లో ఏడేళ్లుగా ఎంతో మందిని తీర్చుదిద్దుతున్నారు.

ఇక ఇదే తరహాలో జయం చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్వేతా యామిని సైతం చదువుల్లో మొదటి నుండి ముందుండేది అందుకే హీరోయిన్ గా అవకాశాలు వద్దనుకుని మొదట క్యాంపస్ ప్లేసెమెంట్స్ ద్వారా విప్రో లో జాబ్ చేసింది ఆ తర్వాత మాస్టర్స్ అమెరికాలోనే పూర్తి చేసి ఆ తర్వాత వరల్డ్ నెంబర్ వన్ సంస్థ అయినా యూనియన్ బెస్ట్ ట్రేడ్ కంపెనీ లో ఉద్యోగం చేసింది. కానీ కొన్ని కారణాల చేత పెళ్లయ్యాక ఫామిలీ బిజినెస్ ని తన భుజాలపై మోస్తుంది శ్వేతా. ఇవ్వండి నటన వదిలి హీరోయిన్స్ చేస్తున్న, చేసిన కీలక ఉద్యోగాలు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

19 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

19 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

20 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

20 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

20 hours ago

గ్రీన్ టీనా.. బ్లాక్ టీనా..? బరువు తగ్గాలంటే ఏది మంచిది.. అసలు నిజం ఇదే!

నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…

20 hours ago