Featured

Telugu Language : ఇండియాలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమందో తెలుసా… తెలుగు భాష ఎన్నో స్థానంలో ఉందో తెలుసా…!

Telugu Language : మానవులలో అత్యంత అందమైన విషయం వారి భాష. భాష మనిషికి మనిషికి మధ్య సంబంధాలను పెంపొందించేదిగా ఉండాలి. ఏ భాషకైనా అదే ప్రమాణం. ప్రతి భాషకూ తనదైన అందం ఉంటుంది. మన దేశంలో చాలా జాతులు తెగలు ఉండటం వల్ల దేశం మొత్తం ఒకే భాష లేదు. కానీ అందరు కలిసి మెలిసి జీవిస్తాము. ప్రతి భాషని, సంప్రదాయాన్ని గౌరవిస్తూ జీవిస్తున్నాం. అందుకే మనది భిన్నత్వంలో ఏకత్వం.

తెలుగు భాష 4వ స్థానంలో ఉంది…

దేశంలో కనీసం పది వేల మంది మాట్లాడే భాషను గుర్తిస్తారు. అలా మన దేశంలో సుమారు 121 భాషలు ఉన్నాయి. 19,500 భాషలు, యాసలు మన దేశంలో మొత్తంగా ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తెలుగు మాతృభాష మరియు అధికార భాష. ఈ రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికారిక భాష హోదా కలిగిన కొన్ని భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు కూడా ఉంది. పుదుచ్చేరిలోని యానం జిల్లాలో తెలుగు అధికారిక భాష. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్ దీవులలో గుర్తించబడిన అల్పసంఖ్యాక భాష. దేశ ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషగా గుర్తించిన ఆరు భాషలలో తెలుగు ఒకటి. ఇక తాజాగా 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎంతమంది ఏ భాషను మాట్లాడుతున్నారో, ఆ సంఖ్యను బట్టి భాష స్థానాన్ని నిర్ణయించారు.

ఇందులో మొదటి స్థానంలో హిందీ నిలిచింది. 52.83 కోట్ల మంది హిందీ మాట్లాడుతున్నారు.
ఇక బెంగాలీ 9.72 కోట్ల మంది మాట్లాడుతూ రెండవ స్థానంలో నిలిచింది.
ఇక 8.30 కోట్ల మంది మాట్లాడుతూ మరాఠి మూడో స్థానంలో నిలిచింది.
మన తెలుగు భాష 8.11 కోట్ల మంది మాట్లాడుతూ నాలుగో స్థానంలో నిలిచింది.
6.90 కోట్ల మంది మాట్లాడుతూ తమిళం ఐదవ స్థానంలో నిలిచింది.
ఆరవ స్థానంలో 5.54 కోట్ల మంది మాట్లాడుతూ గుజరాతి నిలిచింది.
5.07 కోట్ల మంది మాట్లాడుతూ ఉర్దూ ఏడవ స్థానంలో ఉంది.
4. 37 కోట్ల మంది మాట్లాడుతూ కన్నడ ఎనిమిదవ స్థానంలో ఉంది.
3.75 కోట్ల మంది మాట్లాడుతూ ఒడియా భాష తొమ్మిదవ స్థానంలో నిలిచింది.
ఇక 3.48 కోట్ల మంది మాట్లాడుతూ మలయాళం పదవ స్థానంలో నిలిచింది. అలా దక్షిణాది ద్రావిడ భాషలలో ఎక్కువమంది మాట్లాడే మొదటి భాషగా తెలుగు నిలిచింది. మిగిలిన మూడు భాషలు టాప్ పది లోనే ఉండటం విశేషం.

Bhargavi

Recent Posts

ఆల్‌టైం కనిష్టానికి రూపాయి… జనవరి నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ ధరల పెరుగుదల తప్పదా?

భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…

3 weeks ago

చలికాలంలో ‘షాక్’ కొడుతోందా? వస్తువులను తాకితే కరెంట్ తగిలినట్లు ఎందుకు అనిపిస్తుంది?

చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…

3 weeks ago

యోగాకు ఏ సమయం ‘బెస్ట్’? ఉదయమా? సాయంత్రమా? నిపుణులు ఏమంటున్నారు?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…

3 weeks ago

చేపలతో ఇవి కలిపి తింటే ప్రమాదమే! ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…

3 weeks ago

మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉపాధి హామీ చట్టానికి ముగింపు? కొత్త చట్టానికి సిద్ధం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

3 weeks ago

16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా పూర్తిగా బ్యాన్! ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం – కారణాలు చూసి షాక్ అవుతారు

ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…

3 weeks ago