బుల్లితెర తెలుగు రియాలిటీ షో “బిగ్‌బాస్” గురించి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షోకు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ షో ప్రారంభమైందంటే చాలు.. అదో పండుగ. ఇక సోషల్ మీడియాలో బిగ్ బాస్ షో మీద వచ్చే ట్రోల్స్, కామెంట్స్, కంటెస్టెంట్ల చర్చలు, గొడవలు ఇలా ఎన్నో రకాలుగా జనాల నోళ్లలో ఎప్పుడూ నానుతూ ఉంటుంది. అయితే అన్నింటికంటే ముఖ్యంగా బిగ్ బాస్ వాయిస్ మాత్రం నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఇంతకీ ఆ బిగ్ బాస్ వాయిస్ ఎవరదన్నది ఎవ్వరికీ తెలియదు.
అసలు బిగ్ బాస్ ఉంటాడా? అన్నది కూడా ప్రశ్నార్థకమే. అతనికి గొంతు మాత్రమే ఉంటుంది. ఆయనకు శరీరం ఉండదు. బిగ్‌బాస్ 4 సీజన్ మొదలైనప్పటి నుంచి ఒకటే వాయిస్ వినిపిస్తూ ఉంది. ఆ వాయిస్ ఓవర్ ఓ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ది. ఆ గంభీరమైన వాయిస్ ను ఎన్నో సినిమాల్లో కూడా విన్నాం. అతను మరెవరో కాదు.. సినిమాలు, సీరియల్స్, ప్రకటనలకు డబ్బింగ్ చెప్పిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణ. బిగ్ బాస్ షో కోసం రాధాకృష్ణ గొంతునే సెలెక్ట్ చేసుకోవడం వెనుక చాలా తతంగమే నడిచిందట. బిగ్ బాస్ షో మొదటి సీజన్ మొదలయ్యే ముందు షో నిర్వాహకులు దాదాపు 100 మంది గొంతులను పరీక్షించారట. ఆఖరికి రాధాకృష్ణ గొంత సరిపోతుందని నిర్ణయానికి వచ్చారట. బిగ్‌బాస్ రాధాకృష్ణ మాట్లాడే మాటల్లో కనిపించే గాంభీర్యం బాగా నచ్చి అతనిని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ షోలో ప్రతీ రోజూ ఎన్నిసార్లు వినిపిస్తుందో అందరికీ తెలిసిందే. అందరూ ఆ వాయిస్‌ను ఇమిటేట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు కూడా. అదీ ఆ వాయిస్ రేంజ్.
గొప్పతనమేమిటంటే.. బిగ్‌బాస్ షో సీజన్ లెన్ని మారినా.. కంటెస్టంట్లు ఎందరు మారిపోయినా… హౌస్ సెట్ మారైనా.. హౌస్ ప్లేస్, డిజైన్ కూడా మారిపోయినా.. ఆఖరికి బిగ్ బాస్ హోస్ట్ కూడా మారిపోయినా నేటికీ మారని ఒకే ఒక్క అంశం బిగ్‌బాస్ వాయిస్. బిగ్‌బాస్ షోలో ఆకట్టుకునే అతి ముఖ్యమైన అంశాల్లో బిగ్‌బాస్ వాయిస్ ఒకటి అనడంతో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బిగ్‌బాస్ ఎవరో ఎవరికీ తెలియదు. కానీ బిగ్‌బాస్ ఎవరు, కేవలం వాయిస్ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. గంభీరంగా ఉండే ఆ స్వరం కొన్ని సార్లు గగుర్పాటుకు కూడా గురి చేస్తుంటుంది. ‘బిగ్‌బాస్ కోరిక మేరకు…’ అంటూ వచ్చే ఆ వాయిస్ మీకూ నచ్చే ఉంటుంది. ఇంటి సభ్యులు ఏం చేయాలనుకున్నా.. చేయకూడదన్నా అన్నీ బిగ్ బాస్ చూసుకుంటాడు. కనిపించకుండా వినిపిస్తుంటాడు ఈయన. తొలి 2 సీజన్లలో ఒకే తరహా గొంతును వినిపించిన రాధాకృష్ణ …. ఆ తర్వాత మూడో సీజన్‌కు వచ్చేసరికి కాస్త మార్పు చేశాడు. ఇప్పుడు నాలుగో సీజన్‌లోనూ కొత్త స్టయిల్‌ను కొనసాగిస్తున్నాడు. రాధాకృష్ణ గతంలో “సిఐడి” లాంటి డబ్బింగ్ సీరియల్‌కు కూడా డబ్బింగ్ చెప్పాడు. అయితే ఈ విషయంలో ఎక్కడా అధికారిక ప్రకటన రాలేదు. రాధాకృష్ణ కూడా ఈ షో గురించి ఎక్కువగా ఎవరి దగ్గరా మాట్లాడరు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…