Movie News

Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు…. నెగిటివ్ ట్రోల్స్ పై ఘాటుగా సమాధానం చెప్పిన తమన్!

Thaman: తెలుగు సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తమన్ ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తన సినిమాల పరంగా తీవ్ర స్థాయిలో నెగిటివ్ ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా తన గురించి ఎలాంటి విమర్శలు వచ్చినా ఎప్పటికప్పుడు ఆ విమర్శలపై స్పందిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమా నుంచి పాట విడుదలైన సంగతి మనకు తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ అంటే స్టార్ హీరోకి పెట్టాల్సిన సాంగ్ కాదంటూ తమన్ పై భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రమోషన్లలో భాగంగా తమన్ స్పందిస్తూ ఈ విమర్శలపై ఘాటుగా స్పందించారు.

తన గురించి ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ తాను వాటన్నింటినీ ప్రశంసలుగానే స్వీకరిస్తానని తెలిపారు. అయితే ఈ సినిమాలో ఈ పాట అక్కడ పెట్టడం కరెక్ట్ అని భావించే పెట్టామని అయినా ఇది పవన్ కళ్యాణ్ సాంగ్ కాదని సాయి ధరమ్ తేజ్ సాంగ్ అంటూ క్లారిటీ ఇచ్చారు.అంతేకాకుండా తన గురించి చాలామంది విమర్శలు చేస్తున్నారు తాను మ్యూజిక్ పై ఫోకస్ చేయకుండా క్రికెట్ పై ఫోకస్ చేస్తున్నానని కామెంట్స్ చేస్తున్నారు.

Thaman: క్రికెట్ నా వ్యసనం…


నిజానికి నాకు ఎలాంటి వ్యసనాలు లేవు నా వ్యసనం క్రికెట్ మాత్రమేనని తెలిపారు. అది కూడా నేను రాత్రి 9 తర్వాత మాత్రమే క్రికెట్ ఆడటానికి వెళ్తానని నా పనులు మానుకొని క్రికెట్ ఆడటానికి వెళ్లలేదని తెలిపారు.ఈ విషయం గురించి ఏ దర్శకుడు గానీ నిర్మాత గానీ ఇప్పటివరకు నాపై ఫిర్యాదు చేయలేదు అలాంటప్పుడు నేను ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పుకోవాల్సిన పనిలేదు అంటూ క్రికెట్ ఆడటానికి వెళ్తారు అంటూ విమర్శించే వారికి తన స్టైల్ లో సమాధానం చెప్పారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago