Featured

Thammareddy Bharadwaja : రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అవ్వడం గురించి తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్..!

Thammareddy Bharadwaja : రాజ్యసభ నామినేటెడ్ పదవులకు సినిమా రంగం నుండి విజయేంద్ర ప్రసాద్, అలాగే ఇళయరాజా గారిని ఎంపిక చేయడం జరిగింది. సినిమా రంగం నుండి ఇద్దరిని తీసుకోవడంతో ఫిలిం ఇండస్ట్రీ ఆనందంలో ఉంది. ఇక స్వయంగా ప్రధాన మంత్రి ఫోన్ చేసి రాజ్యసభకు ఎన్నికైన వారిని అభినందించారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విజయేంద్ర ప్రసాద్ గారు రాజ్యసభకు నామినేట్ అవ్వడంతో ఈ విషయంపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

కోడిగుడ్డు మీద ఈకలెందుకు పీకడం…

విజయేంద్ర ప్రసాద్ గారు రైటర్ గా భజరంగి భాయిజాన్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, మెర్సెల్, మణికర్ణిక వంటి సినిమాలకు కథ అందించారు. ఇక రాజన్న సినిమాకు దర్శకత్వం వహించారు. విజయేంద్ర ప్రసాద్ గారు రాజ్యసభకు నామినేట్ అవ్వడం గురించి తమ్మారెడ్డి గారు స్పందిస్తూ ఆయనను అభినందించారు. తెలుగు ఇండస్ట్రీ నుండి రాజ్యసభ కు ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇక వేరే వాళ్లకు ఇవ్వకుండా విజయేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వడం వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అని ఇంటర్వ్యూలో ఆయనను అడుగగా వివాదాల జోలికి పోకండి, ఒక తెలుగు వ్యక్తికి వచ్చినందుకు ఆనందించండి ‘కోడి గుడ్డు మీద ఈకలెందుకు పీకాలని‘ అంటూ వాఖ్యణించారు.

ప్రతి విషయాన్ని సమీక్షించాల్సిన పని లేదు అంటూ హితవు చెప్పారు. ఇక టికెట్ రేట్లు, ఆచార్య సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాకపోవడం గురించి మాట్లాడుతూ అది నాకే కాదు ఇండస్ట్రీ లో ఎవరికీ అంతు పట్టని విషయం. ఇద్దరు పెద్ద హీరోలు ఒక పెద్ద డైరెక్టర్ సినిమా కు కనీసం ఓపెనింగ్స్ వస్తాయి సినిమా ఎలా ఉన్నా కానీ అది కూడా రాలేదంటే అర్థమవడం లేదు అంటూ వాఖ్యణించారు. టికెట్ రేట్లు పెరగడం, సినిమా ఓటీటీ లో వెంటనే రావడం వల్ల సినిమాలకోసం థియేటర్లకు జనాలు వెళ్లడం తగ్గిందని అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago