Pooja Hegde: ఆ సినిమా వల్లే నా పై ఆ ముద్ర పడింది..నేను నటించిన చెత్త సినిమా అదే?
Pooja Hegde: అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన పూజా హెగ్డే తమిళ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తరువాత ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్ లలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటు హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. దీంతో అందరు ఐరన్ లెగ్ అంటూ ఈ అమ్మడిని ట్రోల్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ ట్రోలింగ్స్ పై పూజ స్పందించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే తన కెరీర్ లో ఉన్న హిట్టు, ప్లాప్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా పూజ హెగ్డే మాట్లాడుతూ.. నేను తెలుగులో నటించిన 6 సినిమాలు వరుసగా హిట్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తన కెరీర్ లో ఉన్న ప్లాప్ ల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో పూజ మాట్లాడుతూ..నా కెరీర్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్లాప్ సినిమా మొహంజొదారో . నేను నటించిన సినిమాలలో చెత్త సినిమా ఇది. ఈ సినిమ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అవ్వటంతో నాపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది అంటూ చెప్పుకొచ్చింది.
ఈ సినిమా వల్ల ఏడాది పాటు నాకు సినిమా ఆఫర్లు రాలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పూజాహెగ్డే హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈథ్ కభీ దివాలీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఇక తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “జనగణమన” సినిమాలో నటించనుంది. అంతే కాకుండా పాన్ ఇండియా హీరో యశ్ సరసన నటిస్తూ కన్నడలో కూడా అడుగు పెట్టనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…