Categories: Political News

ఏపీలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ విప్లవం.. పచ్చదనం కోసం పవన్ భారీ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం పెంపు, అటవీ విస్తీర్ణం పెంచే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనసాగుతోంది.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొని విత్తన బంతుల తయారీలో భాగమయ్యారు. అధికారులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి స్థానికంగా పెరిగే అంకుడు, వేప, రావి, మర్రి వంటి స్వదేశీ వృక్షాల విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేశారు. జూన్ 15లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 కేంద్రాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుండగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పవన్ కళ్యాణ్ అన్ని చోట్ల పనులను సమీక్షించారు. కొండ కోనలు, అడవుల లోతైన ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో సీడ్ బాల్స్ వెదజల్లే విధానాన్ని కూడా ఆయన పరిశీలించారు.

బటర్‌ఫ్లై పార్క్‌లో ఏర్పాటు చేసిన అటవీ శాఖ స్టాల్స్‌ను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న యోగా హాల్ నమూనాను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రతి ఎకో టూరిజం పార్కులో యోగా హాళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే కొండపల్లి బొమ్మల కళాకారులు సహా చేతివృత్తుల సమస్యలపై స్పందించిన ఆయన, వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కళాకృతులకు మార్కెటింగ్, ప్రచారం కల్పించడంతో పాటు కళాకారులతో తరచూ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago